జిన్‌పింగ్ హౌస్ అరెస్ట్ ఉత్తిదే.. చైనా మీడియా వెల్లడి - MicTv.in - Telugu News
mictv telugu

జిన్‌పింగ్ హౌస్ అరెస్ట్ ఉత్తిదే.. చైనా మీడియా వెల్లడి

September 27, 2022

మావో తర్వాత అత్యంత శక్తివంతమైన నేతగా పేరుపొందిన జీ జిన్ పింగ్ గృహ నిర్భందంలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. అదంతా ఒట్టిదేనని చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. జిన్ పింగ్ బీజింగ్‌లోని ఎగ్జిబిషన్ విజిట్‌కు వచ్చినట్టు తెలిపింది. ఇటీవల ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సుకు వెళ్లి వచ్చిన తర్వాత ఆయన బహిరంగంగా కనిపించడం ఇదే తొలిసారి. దీంతో వచ్చిన వార్తలు కేవలం ఊహాగానాలేనని స్పష్టమైంది.

ఇదిలా ఉంటే ఇప్పటికే రెండు దఫాలుగా అధ్యక్షుడిగా ఉన్న జిన్ పింగ్.. మూడోసారి కూడా పదవిని కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇందుకోసం వచ్చే నెలలో జరిగే సీపీసీ సమావేశం అతి కీలకం కానుంది. ఇప్పటికే జిన్ పింగ్ మార్గదర్శకాలకు అనుగుణంగా 2,300 మంది ప్రతినిధులు సమావేశాలకు ఎన్నికైనట్టు కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది. దీంతో జిన్ పింగ్ ఎన్నిక లాంఛనమేనని స్పష్టమవుతోందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.