ప్రముఖ టెలికాం సంస్థ జియో 5జీ సేవలు ఏపీకి అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల ఎయిర్ టెల్ తన 5జీ సేవలను ప్రారంభించగా తాజాగా జియో 5జీని ఆంధ్రప్రదేశ్‌కి విస్తరించింది. గతంలో ప్రకటించిన తిరుమల, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల్లో 5జీ సర్వీసులను ప్రారంభించారు. జనవరి నాటికి ఏపీలోని మరిన్ని ప్రాంతాలకు జియో తన 5జీ సేవలను విస్తరించనుంది. ఈ నాలుగు నగరాల్లోని జియో వినియోగదారులకు ‘జియో5జి వెల్కమ్ ఆఫర్’ఆహ్వానాన్ని అందింస్తుంది. ఇక 5జీ సేవలు కోసం కొత్త సిమ్ మార్చవల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వాడుతున్న 4జీ సిమ్ ద్వారానే 5జీ సేవలు వినియోగించుకోవచ్చు. 5G నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్ ఉంటే సరిపోతుంది. ప్రీ పెయిడ్ లేదా పోస్ట్ పెయిడ్ వినియోగదారులు తప్పనిసరిగా రూ. 239 లేదా అంతకంటే ఎక్కువ విలువైన జియో ప్లాన్లను రీచార్జ్ చేసుకోవాలి. ఏపీలోని అన్ని మారుమూల ప్రాంతాలకు 5జీ సేవలు అందించేందుకు ఏర్పాటు చేయాలని ఏపీ సర్కార్ కోరుతుంది. ఏపీలో 5జీ సేవలను అందించేందుకు జియో .6,500 కోట్ల పెట్టుబడులు పెట్టింది.