జియో ఏడాదంతా ఫ్రీ.. దీపావళి బంపర్ ఆఫర్ - MicTv.in - Telugu News
mictv telugu

జియో ఏడాదంతా ఫ్రీ.. దీపావళి బంపర్ ఆఫర్

October 18, 2018

కస్టమర్లను ఆకర్షించడంలో ముందున్న రిలయల్స్ జియో ఈ పండగ సీజన్‌కు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒకసారి రీచార్జి చేయించుకుంటే చాలు ఏడాదంతా ఫ్రీ సేవలను అందించే ప్యాకేజీని తీసుకొచ్చింది. ఇప్పుడు రూ.1699తో రీఛార్జ్‌ చేయించుకుంటే వచ్చే ఏడాది దీపావళి వరకు కస్టమర్లు ఉచితంగా అన్ని రకాల ప్రయోజనాలు పొందవచ్చని తెలిపింది.

767

ఏముంటాయి?

ఈ ప్లాన్‌ కింద ఉచితంగా లోకల్‌, నేషనల్‌ కాల్స్‌, అపరిమిత రోమింగ్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 547.5 జీబీ డేటా పొందొచ్చు. అంటే రోజుకు 1.5జీబీ డేటా వస్తుందన్నమాట. రూ. 1699 రూపాయల యాన్యువల్‌ ప్లాన్‌పై 100 శాతం క్యాష్‌బ్యాక్‌ వస్తుంది. దీనికోసం 2018 నవంబర్‌ 30 వరకు ఈ స్కీమ్‌లోకి కస్టమర్లు చేరాల్సి ఉంటుంది. అలాగే రూ.100 కంటే ఎక్కువ మొత్తంలోని అన్ని ప్లాన్లపైనా 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. ఎప్పట్లాగే క్యాష్‌బ్యాక్‌ను కూపన్ల రూపంలో వస్తుంది. కూపన్లను రిలయన్స్‌ డిజిటల్‌ లేదా రిలయన్స్‌ డిజిటల్‌ ఎక్స్‌ప్రెస్‌ స్టోర్లలో కనీసం రూ.5000 పైన కొనుగోలు చేస్తే వాడుకోవచ్చు. అయితే ఈ కొనుగోళ్లలో షరతులు విధించారు. ఎక్స్‌టర్నల్‌ హార్డ్‌ డిస్క్‌ డ్రైవ్స్‌, షావోమి, శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్లు, శాంసంగ్‌, లెనోవో, సోనీ టాబ్లెట్లకు ఈ ఆఫర్ వర్తించదు. రెండు ఓచర్లను కలిపి, ఒక లావాదేవికి వాడటానికి కూడా వీల్లేదు. పైగా ఆ ఓచర్లకు 2018 డిసెంబర్‌ 31నాటికే కాలం చెల్లిపోతుంది. తాజా యాన్యువల్ ఆఫర్‌తో టెలికం మార్కెట్లో జియో మరో సవాలు విసిరింది. ఇక ఎయిర్ టెల్ తదితర సంస్థలు కూడా ఇదే బాట పట్టే అవకాశముంది.