జియో షాక్.. ఇతర నెట్‌వర్క్‌కు ఫోన్ చేస్తే డబ్బు కట్టాల్సిందే.. - MicTv.in - Telugu News
mictv telugu

జియో షాక్.. ఇతర నెట్‌వర్క్‌కు ఫోన్ చేస్తే డబ్బు కట్టాల్సిందే..

October 9, 2019

Jio customers will have to pay 6 paisa min

దసర పండగ సంబరం ముగియగానే రిలయన్స్ జియో తన కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. ఇకపై తమ నెట్ వర్క్ నుంచి రెండు వేరే నెట్ వర్క్ లలోని ఫోన్ నంబర్లకు ఫోన్ చేస్తే నిమిషానికి 6 పైసలు చెల్లించాల్సి ఉంటుందని ఈ రోజు ఓ ప్రకటనలో తెలిపింది. ఎయిర్ టెల్, వొడా ఫోన్- ఐడియా నెట్ వర్క్‌లలోని ఫోన్ నంబర్లకు చేస్తే ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జి కింద డబ్బులు చెల్లించాలని పేర్కొంది.

అలా చెల్లించే డబ్బులకు బదులుగా ఉచిత ఇంటర్నెట్ డేటా ఇస్తామంది. ‘ఇతర నెట్ వర్కులకు రూ. 10 విలువైన టాక్ టామ్ మాట్లాడితే ఒక జీబీ డేటా ఇస్తాం. ఇతర నెట్ వర్కులకు ఫోన్ చేసుకోడానికి రేపటి నుంచి అదనపు టాపప్ కూప్లను వేసుకోవాలి..’ అని వివరించింది. పోస్ట్ పెయిడ్ కస్టమర్లకూడా 6 పైసల నిబంధన వర్తిస్తుందని తెలిపింది. ఇంటర్ యూసేజ్ కనెక్షన్ల కింద ఎయిర్ టెల్, వొడాఫోన్ కంపెనీలకు గత మూడేళ్లలో రూ. 13,500 కోట్లు చెల్లించామని, ఆ నష్టాలను పూడ్చుకోడానికి ఇలా చార్జ్ చేస్తున్నామని చెప్పుకొచ్చింది. జియో నుంచి పోటీని తట్టుకోడానికి ఎయిర్ టెల్, వొడా ఫోన్ కంపెనీలు పలు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో జియో ఇలా షాక్ కొట్టింది.

rr