జియో కస్టమర్లకు షాక్.. ఆ చౌక ప్లాన్ రద్దు - MicTv.in - Telugu News
mictv telugu

జియో కస్టమర్లకు షాక్.. ఆ చౌక ప్లాన్ రద్దు

May 20, 2020

nnfg

ఎప్పుడూ ఏదో ఒక ప్లాన్‌తో వినియోగదారులకు శుభవార్తను వినిపించే రిలయన్స్ జియో తాజాగా షాక్ ఇచ్చింది. కొన్ని కొత్త ప్లాన్లను అందుబాటులోకి తెస్తూనే.. చౌవక ప్లాన్ రద్దు చేసింది. దీంతో ఇప్పటి వరకు  జియో బడ్జెట్‌ ప్లాన్‌గా ఉన్న రూ.98 ప్యాక్‌ తొలగించింది. ఈ ప్లాన్ ధర ఇప్పుడు 129కు చేరింది. దీంతో సాధారణ కాల్స్ కోసం బ్యాలెన్స్ వేసుకునే వినియోగదారుల జేబుకు చిల్లుపడినట్టు అయింది. కరోనా లాక్‌డౌన్‌తో డేటా వాడకం పెరగడంతో.. వార్షిక ప్లాన్లపై దృష్టిపెట్టిన ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. 

ఇప్పటి వరకు రూ. 98 రీచార్జీతో 2 జీబీ డేటా, జియో నుంచి జియోకు ఫ్రీ కాల్స్‌తో పాటు 300 ఎస్ఎంఎస్‌లు 28 రోజుల వ్యాలిడిటీతో అందించింది. తాజాగా దాన్ని తన వెబ్ సైట్ నుంచి తొలగించి రూ. 129ను బడ్జెట్ ప్లాన్‌గా చేర్చింది. దీంట్లో2 జీబీ డేటా, జియో నుంచి జియోకు అన్ లిమిటెడ్ కాల్స్, ఇతర నెట్ వర్క్ సర్వీసులకు 1000 నిమిషాల టాక్ టైం, 300 ఎస్ఎంఎస్‌లు ఇస్తున్నట్టు ప్రకటించింది. వీటితో పాటు రూ. 999 జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకుంటే 84 రోజుల వ్యాలిడిటీతో ప్రతి రోజూ 3జీబీ హైస్పీడ్‌ డేటా వినియోగించుకోవచ్చని ఆ సంస్థ పేర్కొంది.వీటితో పాటు రూ. 599 మరియు రూ. 399 ప్రీపెయిడ్ రీచార్జిలను కూడా అందిస్తోంది.