ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా 2023 సంవత్సరానికి జియో కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. తన యూజర్ల కోసం ‘హ్యాపీ న్యూ ఇయర్ 2023’ ఆఫర్‌ను ప్రకటించింది. తాజా ప్లాన్ విలువ 2023 రూపాయలు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 252 రోజులపాటు అపరిమిత కాలింగ్‌తోపాటు రోజువారీ 2.5 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. రోజూ 100 ఎస్ఎంఎస్లు పొందవచ్చు. వీటికి అదనంగా రిలయన్స్ జియో యాప్స్ ను ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. జియో అధికారిక వెబ్సైట్ లో ఇప్పుడిది అందుబాటులో ఉంది. యూజర్లు ‘మై జియో’ యాప్ ద్వారా కానీ, లేదంటే మొబైల్ రీచార్జ్ ప్లాట్‌ఫామ్స్ అయిన గూగుల్ పే, ఫోన్ పే వంటి వాటి యాప్స్ ద్వారా కూడా రీచార్జ్ చేసుకోవచ్చు.
న్యూ ఇయర్ ప్లాన్‌తోపాటు ఇప్పటికే ఉన్న రూ. 2999 ప్లాన్‌కు మరిన్ని అదనపు ప్రయోజనాలు జోడించింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఏడాది కాగా, అదనంగా మరో 23 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది.
ప్రస్తుతం ఆఫర్లతోపాటు 75 జీబీ అదనపు డేటాను కూడా కల్పిస్తుంది. ఈ ప్లాన్ కాలపరిమితి 365 రోజులు, మొత్తంగా 912.5జీబీ డేటా లభిస్తుంది. అంటే రోజుకు 2.5 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుందన్నమాట. అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, జియో యాప్స్‌ను ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు.