జిల్ జిల్ జియో..! - MicTv.in - Telugu News
mictv telugu

 జిల్ జిల్ జియో..!

September 7, 2017

మొన్ననే  మొదటి పుట్టిన రోజు జరుపుకున్న  జియో నెట్ వర్క్, ఇప్పుడు మల్లో కొత్త రికార్డును సృష్టించింది. మనదేశంలనే కాదు ప్రపంచంలోనే  డేటా వినియోగంలో జియో మొదటి స్థానం కొట్టేసిది. ఈ విషయాన్ని  రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తన ఉద్యోగులతో స్వయంగా చెప్పారు. జియో సర్వీసులు మొదలు పెట్టి  ఏడాది కాకముందే 13 కోట్లకు పైగా వినియోగదారులను సంపాదించుకున్నామని  ఉద్యోగులకు రాసిన లేఖలో ముఖేష్  పేర్కొన్నారు. మౌలిక వసతులను ,టెక్నాలజీని సమర్థమంతంగా ఉపయోగించుకుంటూ  విశ్రాంతి లేకుండా 13 కోట్ల మందికి పైగా  వినియోగదారులకు సేవలందిస్తున్న  కంపెనీ ఉద్యోగులను ముఖేశ్ ప్రశంసించారు.

అపరిమిత వాయిస్‌ కాల్స్‌కు తోడు అపరిమిత 4జీ డేటాను 90 రోజుల పాటు జియో ఉచితంగా అందించిన విషయం తెలిసిందే. జియో  వచ్చిన రెండో నెలలోనే భారత టెలికాం రంగంలోనే ఇదివరకు ఎన్నడు లేని  విధంగా అత్యధిక వినియోగదారులను  జియో సంపాదించుకుందట. ఇగ జియోకు అలవాటు పడిన పబ్లిక్ ఊకుంటరా, ఆ తర్వాత చార్జీలు వసూలు చేసినా  నెట్ వర్క్, సర్వీస్ బాగుండడంతో అందరూ జియో కు ఫిదా అయిపోయారు. అవుమరి  జియో రాకముందు  నెట్ బ్యాలన్స్ కనీ, వాయిస్ కాల్స్ కు  ఒక్కో కంపెనీ… వందలకు వందలే వసూల్ జేసెటోళ్లు , ఇపుడు జియో అచ్చి  ఆఫర్లు వెట్టెవర్కు , అందరు గుడ ముందుకస్తున్నరు  వాళ్ల కంపెనీలు ఎక్కడ లాసైతయో అని… జియోనా మాజాకానా..!