జియో నుంచి కొత్త బ్రౌజర్.. తెలుగులో కూడా అందుబాటులోకి! - MicTv.in - Telugu News
mictv telugu

జియో నుంచి కొత్త బ్రౌజర్.. తెలుగులో కూడా అందుబాటులోకి!

October 22, 2020

Jio launches made-in-India browser

టెలికం దిగ్గజం జియో సరికొత్త మొబైల్ బ్రౌజర్‌ను లాంచ్ చేసింది. దానికి ‘జియోపేజెస్’ అని పేరు పెట్టింది. గతంలో విడుదల చేసిన బ్రౌజర్‌కు ఇది అప్ డేటెడ్ వర్షన్. ఈ బ్రౌజర్ ద్వారా ఎనిమిది భారతీయ భాషల్లో ఇంటర్నెట్ సర్ఫింగ్ చేయవచ్చు. ఈ బ్రౌజర్‌లో వినియోగదారుల వ్యక్తిగత సమాచార గోప్యతకూ పెద్ద పీట వేశామని జియో సంస్థ తెలిపింది. ఈ బ్రౌజర్ లో ఏదైనా సమాచారం కోసం సర్ఫ్ చేసినపుప్పుడు స్థానిక సమాచారం ముందు చూపిస్తుంది. 

ఆ విధంగా ఈ బ్రౌజర్ అల్గారిథన్ని సెట్ చేసినట్టు జియో ఓ ప్రకటనలో తెలిపింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ బ్రౌజర్ లో పేజీలు వేగంగా లోడ్ అవుతాయని, వీడియోల స్ట్రీమింగ్ వేగంగా ఉంటుందని జియో వెల్లడించింది. ఈ బ్రౌజర్ ఇంగ్లీషు, హిందీతో పాటు తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఇక తన పాత బ్రౌజర్‌ను వాడుతున్న దాదాపు 1.40 కోట్ల మందినీ కొత్త బ్రౌజర్‌కు అప్‌డేట్ చేస్తామని జియో తెలిపింది.