దేశీయ దిగ్గజ టెలికం సంస్థ జియో తన వినియోగదారుల కోసం మరో వార్షిక ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది. మూడు నెలలకు ఒకసారి రీఛార్జ్ చేసుకోవడం ఇష్టంలేని వారి కోసం జియో వార్షిక ప్లాన్ లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ ఖరీదు రూ.2,399 కాగా, దీని వ్యాలిడిటీ 365 రోజులు. రోజుకు 2 జీబీ డేటా చొప్పున ఏడాదికి 730 జీబీ డేటా అందించనుంది.
జియో నుంచి జియోకు ఉచితంగా అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఇతర నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి 12,000 నిమిషాలను అందిస్తారు. వీటితో పాటు జియో యాప్స్ కు కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. జియోలో ఇప్పటికే రూ.2,121 వార్షిక ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 1.5 జీబీని 336 రోజుల పాటు అందిస్తారు.