జియో సంచలనం.. 10 కోట్ల ఫోన్ల తయారీ! - MicTv.in - Telugu News
mictv telugu

జియో సంచలనం.. 10 కోట్ల ఫోన్ల తయారీ!

September 9, 2020

Jio May Launch Android-Powered Low-Cost Phone in December

దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎక్కువ కనెక్షన్లతో దూసుకుపోతున్న సంగతి తెల్సిందే. ఇప్పుడు దేశీయ స్మార్ట్‌ఫోన్ విభాగంలో కూడా అగ్రస్థానంలో నిలవాలని చూస్తోంది. తక్కువ ధరకే‌ ఆండ్రాయిడ్‌ ఫోన్లను తయారు చేయడానికి సన్నద్ధమైనది. దాదాపు 10 కోట్ల స్మార్ట్‌ఫోన్లను తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని సమాచారం. 

ఈ స్మార్ట్‌ఫోన్లను డిసెంబర్ నాటికి విడుదల చేయాలని జియో భావిస్తోంది. ఇప్పటికే గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌.. రిలయన్స్‌ డిజిటల్‌ విభాగంలో రూ.33వేల కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా రిలయన్స్ కొత్త చౌక స్మార్ట్ ఫోన్ లను తీసుకుని రానుంది. రిలయన్స్ నుంచి రాబోయే స్మార్ట్‌ ఫోన్లు 4జీ, 5జీ నెట్ వర్క్ లతో పనిచేయనున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పలు విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ తరగతులను విస్తరించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఇదొక మంచి అవకాశమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.