జియో పంద్రాగస్ట్ ఆఫర్.. 5 నెలల ఉచిత డేటా.. - MicTv.in - Telugu News
mictv telugu

జియో పంద్రాగస్ట్ ఆఫర్.. 5 నెలల ఉచిత డేటా..

August 14, 2020

Jio Offers 5 Months of Free Data, Calls With JioFi For Independence Day.

74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రిలయన్స్ జియో బంపర్ ఆఫర్‌ ప్రకటించింది. ‘జియోఫై 4జీ వైర్‌లెస్‌ హాట్‌స్పాట్‌’ కొత్త ఆఫర్‌ను వెల్లడించింది. ఈ ఆఫర్‌లో కొనుగోలుపై ఐదు నెలల వరకు ఉచిత డేటా, జియో నుంచి జియో కాల్స్‌ ఉచితంగా అందించనుంది. రూ.1,999తో జియో ఫైను కొనుగోలు చేయడంతో పాటు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్లాన్లను కూడా రీఛార్జి చేసుకుంటే ఈ ఆఫర్‌ను పొందొచ్చు అని జియో ఓ ప్రకటనలో వెల్లడించింది. జియో ఫై వినియోగదారుల కోసం ప్రస్తుతం మూడు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. 

రూ.199తో రీఛార్జ్ (28 రోజుల వ్యాలిడిటీతో 1.5 జీబీ రోజువారీ డేటా, జియో నుంచి జియో అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, 1000 వరకు జియో నుంచి ఇతర నెట్‌వర్కులకు కాల్స్‌ చేసుకునే సదుపాయం). దీనికి రూ.99తో జియో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ తీసుకుంటే అదనంగా 1.5జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ జియో టు జియో కాల్స్‌, 1000 వరకూ ఇతర నెట్‌వర్క్‌లకు కాల్స్‌(ఆ తర్వాత నుంచి నిమిషానికి ఆరు పైసలు) 140 రోజుల పాటు లభిస్తాయి. 

రూ.249 తో 2జీబీ, 28 రోజుల వ్యాలిడిటీ ఉండగా, రూ.349 3జీబీ, 28 రోజుల వ్యాలిడిటీ ఉన్న విషయం తెలిసిందే. ఈ ప్లాన్లతోనూ రూ.99తో ప్రైమ్‌ మెంబర్‌ షిప్‌ తీసుకుంటే.. వాటి ప్లాన్‌ ఆధారంగా వ్యాలిడిటీ లభిస్తుంది. కాగా, ఈ డివైజ్‌ను రూ.94 చొప్పున ఈఎంఐ చెల్లించి కూడా కొనుగోలు చేయొచ్చని.. జియో డిజిటల్‌ స్టోర్లు, జియో వెబ్‌సైట్‌‌ల నుంచి ఈ ఆఫర్ను పొందొచ్చు అని జియో ప్రకటించింది. =