21 నుంచి జియో ఫోన్ డెలివరీ - MicTv.in - Telugu News
mictv telugu

21 నుంచి జియో ఫోన్ డెలివరీ

September 2, 2017

జియో 4జీ ఫ్రీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు శుభవార్త.  ఈ ఫోన్లను సెప్టెంబర్ 21 నుంచి దేవి నవరాత్రుల సందర్భంగా  డెలివరి చేయనున్నట్టు జియో కంపెనీ ప్రకటించింది. గ్రామా వాసులకు సైతం 4జీ నెట్ వర్క్ అందుబాటులోకి తీసుకురావడానికి రియలన్స్ అధినేత ముఖేష్ అంబానీ జియో ఫోన్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్నాడు. ఈ ఫోన్ కోసం చెల్లించిన రూ. 1500 డిపాజిట్ ను తిరిగి వెనక్కి చెల్లిస్తామంటూ ప్రకటించడంతో దీనిపై మార్కెట్లో మంచి క్రెేజ్ ఏర్పడింది. ఆగస్టు 24 నుంచి  బుకింగ్స్ ప్రారంభంకావడంతో ఒక్క రోజే 60 లక్షల మంది బుకింగ్స్ చేసుకున్నట్టు కంపెనీ ప్రకటించింది. వెబ్ సైట్ ద్వారా మరో కోటి మంది రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.