జియో ఫ్రీ ఫోన్ బుకింగ్స్ ఖతం... - MicTv.in - Telugu News
mictv telugu

జియో ఫ్రీ ఫోన్ బుకింగ్స్ ఖతం…

August 26, 2017

అగడు వడ్డ పోశమ్మ మొగున్ని మింగిందట.. అగో సేమ్ అట్లనే అయ్యింది  జియో ఫోన్ ఫ్రీ బుకింగ్స్ ముచ్చట గుడ. జియో ఫ్రీ ఫోన్  బుకింగ్స్ గురువారం సాయంత్రం 5.30 నుంచి ఓపెన్ అయితయ్ అని టైంతోని సహా గట్టిగ చాటింపు జేశెవర్కు. ఇగ ఊకుంటరా జనాలు? పబ్లికందరు ఒక్కటేపారిగ వెబ్ సైట్ మీద పడెవర్కు ఆయింత వెబ్ సైటే క్రాష్ అయ్యింది.

ఇంకేముంది  ఇదెక్కడి కతరో అని జియో కంపినోళ్లు ఇప్పటికైతే  ఫ్రీ బుకింగ్స్ బంజేస్తున్నట్టు ప్రకటించిన్రు. ప్రీ-బుకింగ్స్‌ను తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తమో తర్వాత జెప్తమంటూ సైట్‌లో రాశిన్రు. దాదాపు 50 కోట్ల మంది యూజర్లు జియో ఫోన్‌ కోసం ముందస్తు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారట.

ఫ్రీ ఫోన్‌ అయినా ఇందుకోసం రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్‌ చేస్తే.. మూడేళ్ల తర్వాత ఆ డబ్బును వినియోగదారులకే ఇస్తామని జియో ప్రకటించిన విషయం తెలిసిందే.

మార్కెట్‌ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే ఆ కొద్ది సేపట్లనే దగ్గరి దగ్గర  కోటి ఫోన్లు బుక్‌ అయినయట. జియో ఫోన్‌ను ఇప్పుడు బుక్‌ చేసుకున్న వారికి సెప్టెంబర్‌లో ఫోన్ ను అందిస్తరట. మొత్తం మీద ఫ్రీ జియో ఫోన్ ను కోసం ఆరాటపడిన చాలామందికి  నిరాశే మిగిలింది.