జియో ఫోన్ జిగేల్ ఆఫర్స్ ! - MicTv.in - Telugu News
mictv telugu

జియో ఫోన్ జిగేల్ ఆఫర్స్ !

August 9, 2017

మొత్తానికి జియో వేరే నెట్ వర్కోల్లను, ఇతర ఫోన్ల కంపెనీ వాళ్ళను సైను పట్టకుంట టార్గెట్ చేసిందని తాజా వార్త వింటే నిజమే అనాల్సి వస్తుంది. ‘ అప్నా ఖావో అప్నా జియో ’ అన్నట్టుగానే తయారైంది జియో వ్యవహారం. 15 ఆగస్టు నుండి జియో ఫోన్లు మార్కెట్లోకి రానున్న సందర్భంగా రిలయన్స్ ఈ నెల 24 నుండి అడ్వాన్స్ బుకింగ్ ను మొదలు పెడుతోంది. సెప్టెంబర్ 1 నుండి ప్రతీ ఒక్కరి చేతిలో జియో వుండాలనే మాస్టర్ ప్లాన్ తో వస్తోంది రిలయన్స్ కంపెనీ. 1,500 రూపాయల రిఫండుతో ఫ్రీగా అందిస్తోంది. ఈ ఆఫర్ కు ఇప్పటికే చాలా మంది జనాలు పాగల్ అయిపోయారు.

ఇతర ఫోన్ తయారీ కంపెనీ దారులకు చెమట్లు పట్టేసాయి అప్పుడే. ఈ నెల 24 నుండి ఈ జియో ఫోన్ల రిజిస్ట్రేషన్లు స్టార్ట్ అవుతాయట. అయితే ఒక్కరికి ఒకే ఫోనా, లేకపోతే ఎన్నైనా ఇస్తారా అనే డౌటు నెలకొని వుండే. అలాంటి డౌట్స్ ను క్లియర్ చెయ్యటానికి ‘ జియో డాట్ కామ్ ’ లో రిజిస్ట్రేషన్ పేజీని పొందు పరుస్తున్నది. కీప్ మీ పోస్టెడ్ పేరుతో ఈ వెబ్ పేజ్ అందుబాటులో వుంటుంది. ఇందులో పర్సనల్, బిజినెస్ అని రెండు ఆప్షన్లు ఇస్తోంది. బిజినెస్ ఆప్షన్ కింద ఒక్కరు ఎన్ని ఫోన్లైనా తీస్కోవచ్చని అంటోంది. కాంటాక్ట్‌ నేమ్‌, కంపెనీ పేరు, పిన్‌ కోడ్‌, పాన్‌ లేదా జీఎస్టీఎన్‌ నెంబర్‌, ఈమెయిల్‌ ఐడీ, కాంటాక్ట్‌ చేయాల్సిన వ్యక్తి నెంబర్‌, ఎన్ని డివైజ్‌లు అవసరమో తెలుపుతూ రిజిస్ట్రర్‌ చేసుకుంటే, బల్క్‌గా ఆర్డర్లను పొందవచ్చట. రిజిస్ట్రేషన్ వివరాలు అన్నీ కూడా ఆగస్ట్ 15వ తేదీ నుంచి జియో కాట్ కామ్ వెబ్ పేజీలో అందుబాటులో ఉంటాయి.

అప్పట్లో రిలయన్స్ ఫోన్లు ఎంత సంచలనం సృష్టించాయో మనందరికీ ఎరుకున్న ముచ్చటే. తర్వాత జియో పేరుతో ఇంటర్నెట్టు ఆఫరిస్తూ సిమ్ కార్డులను ఎలా బట్వాడా చేసిందీ విధితమే. ఇప్పుడు పాత రిలయన్స్ పేరుతో గాకుండా కొత్తగా జియో పేరుతో వస్తున్న ఈ ఫోన్ లు వినియోగదారులను ఏ మేరకు సంతృప్తి పరుస్తాయో చూడాలి.