రూ.500 లకే జీయో 4జీ ఫోన్ - MicTv.in - Telugu News
mictv telugu

రూ.500 లకే జీయో 4జీ ఫోన్

July 5, 2017

ఫ్రీ కాల్స్,ఫ్రీ డేటాతో సంచలనం సృష్టించిన జియో మరో అదిరిపోయే ఐడియాతో వస్తోంది. రూ.500 లకే 4జీ ఫోన్ ను తీసుకురాబోతోంది. 5వేల పెట్టినా దొరకని 4జీ స్మార్ట్ ఫోన్ ను జియో కేవలం ఐదు వందల రూపాయలకే అందించబోతోంది. వీఎల్‌టీఈ సదుపాయం కలిగిన ఫీచర్‌ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. ఈ నెలలోనే విడుదల చేయనుందని తెలుస్తోంది. అంతేకాదు దీన్ని కేవలం రూ.500కే అందించాలని జియో యోచిస్తోంది. ఇది జరిగితే జియో సునామీకి మిగతా టెలికాం సంస్థలు కొట్టుకుపోవాల్సిందే. 21న కంపెనీ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో కొత్త ఫోన్‌ విషయాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2జీ సబ్‌స్క్రైబర్లను 4జీకి మార్చేందుకు గాను జియో.. సబ్సిడీపై ఈ ఫోన్లను అందించనుంది. దీంతో పాటు ధన్‌ ధనాధన్‌ ఆఫర్‌కు కొనసాగింపుగా మరో ప్రమోషనల్‌ ఆఫర్‌ను కూడా ప్రకటించే అవకాశం ఉంది.