త్వరలో అందుబాటులోకి 'జియో 5G' - MicTv.in - Telugu News
mictv telugu

త్వరలో అందుబాటులోకి ‘జియో 5G’

March 16, 2019

దేశీయ టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన జియో నెట్‌వర్క్‌ మరో సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. వొడాఫోన్‌, ఐడియా, ఎయిర్‌టెల్‌ల నుంచి వస్తున్న పోటీని తట్టుకోవడానికి 2020 ద్వితీయార్ధంలో జియో 5జీ సేవలను వినియోగరాలకు అందుబాటులోకి తీసుకొని రావడానికి కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు మనం దేశంలో 2జీ,3జీ, 4జీ సేవలు మాత్రమే అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. 4జీ కూడా ఇటీవలి కాలంలోనే ప్రాచుర్యం చెందుతోంది. డేటా వినియోగం ఉన్న కూడా 5జి సేవలను వినియోగించుకునే టెక్నాలజీ అందుబాటులో లేదు.

vJio to speed up 5G rollouts to widen technology gap with Airtel, Voda Idea

జియో5జి సేవల గురించి దీనిపై ముకేశ్ అంబానీ మాట్లాడుతూ..‘జియో నెట్‌వర్క్ ఇప్పటికి 280 మిలియన్ల మంది సభ్యులు వచ్చి చేరారు. ప్రపంచంలోని అతిపెద్ద మొబైల్‌ నెట్‌వర్క్స్‌లో జియో ఒక్కటిగా నిలిచింది. దేశంలోని ప్రజలకు జియో చాలా బాగా ఉపయోగపతుంది. దేశంలోని ప్రజలు జియోకు బాగా కనెక్ట్ అయ్యారు. ఇంతలా ఆదరించిన వినియోగదారులకు మరింత స్పీడుతో, నాణ్యతతో 5జీ సేవలను అందించడానికి కృషి చేస్తున్నాం. ప్రస్తుతం జియోలో నెలకొన్న కొన్ని సమస్యలను పరిష్కరించడంలో బిజీగా ఉన్నాం. దేశంలోని పరిస్థితులను కొద్ది రోజుల పాటు అధ్యయనం చేస్తాం. అక్కడ వచ్చే ఫలితాలను బట్టి ఒకేసారి 5జీ సేవలు ప్రారంభించాలా లేదా అనేది నిర్ణయిస్తాం’ అని తెలిపారు.