జియో అదిరిపోయే ఆఫర్లు..! - MicTv.in - Telugu News
mictv telugu

జియో అదిరిపోయే ఆఫర్లు..!

July 12, 2017

రిలయన్స్ జియో సంచలన ఆఫర్లను ప్రకటించింది. ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ తీసుకున్న వారికి 399 కే 84 జీబీ డేటా అందిస్తోంది. 84 రోజుల పాటు అపరిమిత కాల్స్‌ చేసుకోవచ్చు. రోమింగ్‌లో కూడా ఇన్ కమింగ్ , ఔట్ గోయింగ్ కాల్స్ కు ఛార్జీ పడదు. ప్రీపెయిడ్‌ పథకంలో రూ.399కి 84 రోజుల పాటు అపరిమిత కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌ ల కు తోడుగా, రోజుకు 1 జీబీ చొప్పున 4జీ డేటా వినియోగించుకునే పథకాన్ని ప్రవేశ పెట్టింది.

ఇప్పుడు అమల్లో ఉన్న రూ.309 పథకంలో మార్పు చేసింది. ఇకపై ఈ పథకం కింద 56 రోజులకు అపరిమిత కాల్స్‌- ఎస్‌ఎంఎస్‌లకు తోడు రోజుకు 1జీబీ చొప్పున 4జీ డేటాను వినియోగించుకోవచ్చు. అదే రూ.349తో రీఛార్జి చేసుకుంటే 56 రోజుల పాటు అపరిమిత కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లతో పాటు 4జీ డేటా 20 జీబీ దొరుకుతుంది. రోజుకు ఎంత డేటా వాడాలనే లిమిట్స్ లేవు. ఏప్రిల్‌లో ప్రకటించిన జియో ధనాధన్‌ ఆఫర్‌ కింద ఇప్పటివరకు రూ.309 చెల్లింపుపై 84 రోజుల పాటు అపరిమిత కాల్స్‌, రోజుకు 1జీబీ డేటా లభించింది. ఇప్పుడు ఈ పథకంలో మార్పు జరిగింది. అంటే పాత పథకంపై 90 రూపాయలు అదనంగా చెల్లిస్తే, మరో 3 నెలలు (84 రోజుల పాటు) ప్రస్తుత పథకాన్నే వినియోగించుకోవచ్చు. ఈనెల 11నే కొత్త పథకాలు అమల్లోకి వచ్చాయి. పోస్ట్‌పెయిడ్‌ పథకాలు రూ.309 నుంచీ మొదలవుతున్నాయి. నిర్దిష్ట పరిమితి దాటాక 128 కేబీపీఎస్‌ వేగంతో అపరిమితంగా డేటా వాడుకోవచ్చు.

ఇప్ప్పుడు ప్రకటించిన రూ.399 పథకంలో తక్కువ ధరకు, అధిక వేగం 4జీ డేటా పొందే చాన్స్ ఉంది. 84 రోజుల పాటు 84 జీబీ లభిస్తుంది. అంటే 1జీబీకి రూ.4.75 మాత్రమే అవుతోంది. కాల్స్‌ అన్నీ ఉచితం. ఇది వినియోగదారులను ఖుషీ చేస్తుంది. ఈ పథకాన్నే అందరూ కనుక ఎంచుకుంటే, జియోకు కూడా ఒక వినియోగదారుడిపై లభించే సగటు ఆదాయం (ఆర్పు) రూ.133 అవుతుంది. భారతీ ఎయిర్‌టెల్‌ ఆర్పును చూస్తే, మార్చి క్వార్టర్ లో వాయిస్‌ కాల్స్‌పై రూ.114, డేటాపై రూ.162గా రికార్డైంది. ఇతర టెలికాం సంస్థల స్థాయిలోనే జియో ఆదాయం కూడా నమోదు అవ్వనుంది. ఉచిత సేవలతో ప్రారంభించి, అతిస్వల్ప కాలంలో 12 కోట్ల మంది మెంబర్స్ ను అట్రాక్ట్ చేసింది. ఇది టెలికాం రంగంలో జియో సాధించిన సంచలన విజయం.