జియో మరో సంచలనం.. క్రికెట్ ప్రియులకు అదిరిపోయే ఆఫర్ - MicTv.in - Telugu News
mictv telugu

జియో మరో సంచలనం.. క్రికెట్ ప్రియులకు అదిరిపోయే ఆఫర్

September 14, 2019

JioTV.

క్రికెట్ అంటే చాలా మంది ఇష్టపడతారు. దీనికి ఉన్నంతగా క్రేజ్ మరే ఆటకు లేదనే చెప్పాలి. క్రికెట్ మ్యాచ్ వస్తుంటే చాలు అందరి దృష్టి అటువైపే ఉంటుంది. మ్యాచ్ చూసేందుకు టీవీల ముందు వాలిపోతారు. కానీ కొన్నిసార్లు టీవీ అందుబాటులో లేనివారు మొబైల్ యాప్‌లలో చూస్తారు.  మొబైల్ , డెస్క్ టాప్ లలో వీక్షించాలంటే హాట్ స్టార్ , సోనీ లివ్ వంటి యాప్ లలో డబ్బులు కడితేనే చూసే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారి కోసం జియో మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి క్రికెట్ మ్యాచ్ వచ్చిందంటే చాలు తమ యాప్‌లో ఉచితంగా చూసే అవకాశం కల్పించబోతోంది. 

త్వరలో ప్రారంభంకానున్న  సౌత్ ఆఫ్రికా -ఇండియా సిరీస్ ను జియో తమ యూజర్లు కు ఫ్రీగా వీక్షించే సదుపాయం కల్పించింది. ఎక్కడ ఉన్నా తమ యాప్‌లో చూసుకునే వీలు కల్పించారు. జియో టీవీని డౌన్‌లోడ్ చేసుకొని మొబైల్‌లో నెట్ ఉంటే చాలు మ్యాచ్ వీక్షించవచ్చు. ఇందులో  ఇంగ్లీష్,హిందీ,తెలుగు,తమిళ,కన్నడ భాషల్లో కూడా కామెంట్రీ వినే అవకాశం ఉంది. ఇందుకోసం జియో, స్టార్స్ ఇండియా తో ఒప్పుందం కుదుర్చుకుంది. టెలికామ్ రంగం లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన జియో తాజా నిర్ణయంతో క్రికెట్ ప్రియులు తెగసంబరపడిపోతున్నారు.