హరియాణాలో సీన్ రివర్స్.. కింగ్‌మేకర్‌గా దుశ్యంత్.? - MicTv.in - Telugu News
mictv telugu

హరియాణాలో సీన్ రివర్స్.. కింగ్‌మేకర్‌గా దుశ్యంత్.?

October 24, 2019

Haryana ..

హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆ దిశగా అవకాశాలు కనిపించడంలేదు. ఇప్పటి వరకూ ఏ పార్టీ అక్కడ మేజిక్ ఫిగర్ దిశగా ఆధిక్యాన్ని చూపలేకపోయింది. దీంతో దుశ్యంత్ చౌతాల నేతృత్వంలోని జననాయక్ జనతా పార్టీ కింగ్ మేకర్‌గా మారే అవకాశం కనిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ దుశ్యంత్‌తో సంప్రధింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. 

90 అసెంబ్లీ స్థానాలు ఉన్న హరియాణా అసెంబ్లీకి 46 సీట్లు వస్తేనే అధికారం చేజిక్కించుకోవచ్చు. కానీ ఇప్పటి వరకు బీజేపీ 40 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ 29 స్థానాల్లో జేజేపీ 11, ఇతరులు 10 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. ఈ ఎన్నికల్లో జాట్లు.. సీఎం ఖట్టర్‌కు జలక్ ఇచ్చినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే దుశ్యంత్ తీసుకోబోయే నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారింది.