jk-dg-prisons-found-dead-with-slit-throat
mictv telugu

జమ్మూలో జైళ్ల శాఖ డీజీపీ దారుణ హత్య.. పరారీలో సహాయకుడు

October 4, 2022
J&K DG prisons found dead with slit throat
J&K DG prisons found dead with slit throat

జమ్మూకాశ్మీర్‌ జైళ్ల శాఖ డీజీపీ హేమంత్ కుమార్ లోహియా సోమవారం దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు ముందుగా లోహియాకు ఊపిరాడకుండా చేసి తర్వాత పగిలిన సీసా ముక్కతో గొంతు కోసి చంపారని, అనంతరం మృతదేహం తగులబెట్టేందుకు ప్రయత్నించారని జమ్ము జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫోలీస్ ముకేశ్ సింగ్ వెల్లడించారు. ఇంట్లో పనిచేసే యాసిర్ అనే వ్యక్తిపై అనుమానం రాగా, హత్య అనంతరం పరారీలో ఉన్న అతడి కోసం గాలిస్తున్నామని తెలిపారు. నిందితుడు రాంబన్ జిల్లా అని ప్రకటించారు. 1992 బ్యాచ్‌కు చెందిన 57 ఏళ్ల లోహియా తన ఇంట్లో పునరుద్ధరణ పనులు జరుగుతుండడంతో స్నేహితుడైన రాజీవ్ ఖజురియా ఇంట్లో కుటుంబంతో కలిసి ఉంటున్నారని వివరించారు. అటు ఈ హత్యకు తామే బాధ్యులమంటూ ఉగ్రవాద సంస్థ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ప్రకటించింది. ‘ఇలాంటి హై ప్రొఫైల్ ఆపరేషన్లకు ఇది ప్రారంభం మాత్రమే. మేం తలచుకుంటే ఎక్కడైనా, ఎప్పుడైనా దాడి చేయగలం. హిందుత్వ పాలకులను వారి భాగస్వాములను హెచ్చరించేందుకే ఇదంతా. భారీ భద్రత మధ్య కశ్మీర్ పర్యటనకు వస్తున్న హోం మంత్రి అమిత్ షాకు ఇది స్మాల్ గిఫ్ట్’ అని పేర్కొంది.