ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జేకే మహేశ్వరి - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జేకే మహేశ్వరి

August 30, 2019

JK Maheshwari..

మధ్యప్రదేశ్‌ హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తిగా ఉన్న జేకే మహేశ్వరిని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఆయనకు రాజ్యాంగపరమైన పలు కేసులు వాదించిన ఆనుభవం ఉండటంతో సుప్రీం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో జస్టిస్‌ విక్రంనాథ్‌ పేరును ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొలీజియం సిఫారసు చేసింది. అయితే కొన్ని అనివార్య కారణాలతో కేంద్రం ఆయన పేరును వెనక్కి తిప్పి పంపించింది. తాజాగా జస్టిస్‌ మహేశ్వరి పేరును సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. 

మహేశ్వరి మధ్యప్రదేశ్‌లో సివిల్, క్రిమినల్‌ న్యాయవాదిగా పనిచేశారు. 2005లో మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులు అయ్యారు. 2008లో పూర్తిస్థాయి న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.