మాస్క్ కొనుక్కోవాలని డబ్బులిచ్చిన పోలీస్ (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

మాస్క్ కొనుక్కోవాలని డబ్బులిచ్చిన పోలీస్ (వీడియో)

March 26, 2020

J'khand CM shares video of policeman giving money to man for mask

కరోనా మహమ్మారిని ఈ దేశం నుంచి తరిమి కొట్టాలంటే ముందు ఉన్న తొలి మార్గం ముఖాలకు మాస్కులు ధరించడం. ఆ తర్వాత చేతులను పరిశుభ్రంగా కడగాలి. అయితే కొందరు ఈ విషయంలో చాలా నిర్లక్ష్యంగా  వ్యవహరిస్తున్నారు. మనకొచ్చినప్పుడు చూసుకుందాంలే అనే తెలివి తక్కువ ధోరణితో మాస్కులు ధరించకుండానే యథేచ్ఛగా బయటకు వస్తున్నారు. ఇలాంటి ఆకతాయిలకు జార్ఖండ్ పోలీసులు బుద్ధి చెప్పారు. మాస్క్ లేకుండా రోడ్డు మీదకు వచ్చిన అతనిని ఓ పోలీస్ అధికారి అడ్డగించి అతనితో మాట్లాడారు. మాస్క్ లేకుండా బయటకు వచ్చినందుకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం మాస్క్ కొనుక్కోవడానికి తన జేబులోంచి డబ్బులు ఇచ్చి పంపారు. ఈ ఘటన గొడ్డా ప్రాంతంలో చోటు చేసుకోగా.. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. 

ఈ వీడియోను జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రీట్వీట్ చేశారు. సదరు పోలీస్ అధికారిని మెచ్చుకుంటూ.. అతన్ని తగినవిధంగా సత్కరించాలని ఉన్నతాధికారులకు  ఆదేశించారు. అయితే జార్ఖండ్‌లో ఇప్పటివరకు  ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. కాగా, ప్రపంచాన్ని కరోనా కృంగదీస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి 4 లక్షలకు పైగా ప్రజలు ఈ వైరస్ బారిన పడ్డారు. భారత్‌లో ఇప్పటివరకు 680పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. దేశంలోని 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ వైరస్ వ్యాపించింది.