JNTU విద్యార్థులకు గుడ్ న్యూస్..15 మార్కులు కలుపుతున్నారు - MicTv.in - Telugu News
mictv telugu

JNTU విద్యార్థులకు గుడ్ న్యూస్..15 మార్కులు కలుపుతున్నారు

November 9, 2022

 

JNTU Hyderabad increased the grace marks for 2018 batch engineering students

బీటెక్‌ విద్యార్థులకు జేఎన్‌టీయూ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రెండు బ్యాక్‌లాగ్స్‌ ఉన్న విద్యార్థులకు 15 గ్రేస్‌ మార్కులను కలపాలని నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం ప్రకటించింది. అయితే, ఇది కేవలం 2018 (ఈ ఏడాది పాస్‌ అవుట్‌) బ్యాచ్‌కు మాత్రమే వర్తిస్తుందని వర్సిటీ వీసీ కట్టా నరసింహరెడ్డి స్పష్టం చేశారు. బ్యాక్‌లాగ్స్‌ ఉన్న విద్యార్థులకు డిసెంబరులో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కరోనా కారణంగా ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో విద్యార్థుల చదువు సరిగా సాగలేదని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఫెయిలైన విద్యార్థులు(కేవలం రెండు బ్యాక్‌లాగ్స్‌ ఉన్న వారు) పాస్ కానున్నారు.  3 కంటే ఎక్కువ సబ్జెక్టులు ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

 

సాధారణంగా ఇంజనీరింగ్‌లో ఒకట్రెండు బ్యాక్‌లాగ్స్‌ ఉన్న విద్యార్థులకు గ్రేస్‌ మార్కులను కలిపి పాస్‌ చేస్తారు. 2018 బ్యాచ్‌ విద్యార్థులకు గరిష్ఠంగా 9 మార్కులు కలపాలని ఇప్పటికే నిర్ణయించారు. తాజాగా గవర్నర్ మరియు వీసీ ఏకాభిప్రాయంతో మరో 6  గ్రేస్‌ మార్కులు కలపాలని జేఎన్‌టీయూ నిర్ణయించింది.