రూ.7 వేల కోట్లు వసూలు చేసిన జోకర్.. - MicTv.in - Telugu News
mictv telugu

రూ.7 వేల కోట్లు వసూలు చేసిన జోకర్..

November 16, 2019

 

Joker ..

‘జోకర్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన కలెక్షన్లు రాబడుతోంది. తాజాగా అరుదైన ఘనతను సాధించింది. అక్టోబర్ 2న విడుదలై ‘జోకర్’ రూ.7000 కోట్లు వసూలు చేసిన మొదటి ఆర్-రేటింగ్ సినిమాగా నిలిచి రికార్డు సృష్టించింది. జాక్విన్ ఫీనిక్స్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం ఇండియాలో కూడా భారీ వసూళ్లను సాధించడం గమనార్హం. వివాదస్ప చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన టాడ్ ఫిలిప్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. వార్నర్ బ్రదర్స్, డీసీ ఫిల్మ్ సంయుక్తంగా నిర్మించాయి. విడుదలకు ముందే ఈ సినిమా వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గోల్డెన్ లయన్ అవార్డు గెలుచుకుంది. 

785 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసిన ర్యాన్ రేడోల్స్ నటించిన ‘డెడ్‌పూల్-2’ చిత్రం రికార్డును ‘జోకర్’ బద్దలు కొట్టింది. ఈ సినిమా రిలీజ్‌కు ముందే వివాదాలకు తెరలేపింది. సినిమాలోని దృశ్యాలు హింసాత్మకంగా ఉన్నాయంటూ అనేక విమర్శలు వచ్చాయి. ఇది హింసాత్మక సినిమా అని దీనిని బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. విమర్శలను స్వాగతించిన చిత్ర బృందం.. సినిమాలోని అంశాల గురించి క్షుణ్ణంగా వివరించే ప్రయత్నం చేసింది. చిత్రంలోని ప్రధాన పాత్రధాని జాక్విన్ ఫీనిక్స్ నటనకు ప్రశంసలు అందుకున్నాడు.