త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల: హారీష్ రావు - MicTv.in - Telugu News
mictv telugu

త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల: హారీష్ రావు

April 29, 2022

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని, రాష్ట్రంలో ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. తాజాగా పోలీస్ శాఖల్లో 16వేల పోస్టులకు ప్రకటన విడుదల చేసింది. ఆ తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలో అతి త్వరలోనే జాబ్‌ క్యాలెండర్‌ను కూడా విడుదల చేయనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు.

నిజామాబాద్‌ జిల్లాలో శుక్రవారం హరీష్ రావు పర్యటించారు. ఆయన మాట్లాడుతూ..”తాజాగా రాష్ట్రంలో పరిస్థితులు మారాయి. దేశానికే ధాన్యం అందించే స్థాయికి తెలంగాణ చేరుకుంది. రైతులకు బీజేపీ ఏం చేసిందో, ఒక్క మంచి పని చెప్పాలి. హిందూ, ముస్లింల మధ్య కొట్లాట పెట్టడం తప్పా. దేశ వ్యాప్తంగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే దమ్ము బీజేపీకి ఉందా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేసన్లు విడుదల చేసింది..అతి త్వరలోనే జాబ్ క్యాలెండర్‌ను కూడా విడుదల చేయబోతున్నాం. ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు భర్తీ చేయబోతున్నాం” అని ఆయన అన్నారు.