Job offer for Kerala BTech student with Rs 3 crores
mictv telugu

నయా రికార్డ్.. బీటెక్ విద్యార్ధికి రూ. 3 కోట్లతో జాబ్ ఆఫర్

August 6, 2022

మల్టీనేషనల్ కంపెనీలు తమకు కావాల్సిన నైపుణ్యాలున్న విద్యార్ధులను కాలేజీల వద్దకు వెళ్లి క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు చేసుకుంటున్నాయి. భారీ ప్యాకేజీలతో చిన్న వయసులోనే జాబ్ ఆఫర్లు అందిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ బీటెక్ విద్యార్ధి ఏకంగా రూ. 3 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు. కేరళకు చెందిన మహమ్మద్ యాసిర్ పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో సీఎస్‌ఈ పూర్తి చేశాడు. కాలేజీ రోజుల్లోనే టెక్నికల్ ఫండమెంటల్స్, ఏఐ, ఎంఎల్ వంటి వాటితో పాటు కొత్త టెక్నాలజీలపై మంచి పట్టు సాధించాడు. క్యాంపస్‌లో నిర్వహించే హ్యాకథాన్లలో చురుగ్గా పాల్గొనేవాడు. చదువు పూర్తయిన తర్వాత ఏ కోర్సు నేర్చుకోకుండా తన స్కిల్స్‌తో జర్మనీకి చెందిన మల్టీ నేషనల్ కంపెనీలో భారీ ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించాడు. దాంతో విద్యార్ధితో పాటు అతని తల్లిదండ్రులు అమితానందం వ్యక్తం చేస్తున్నారు.