job vacancy in life insurence corporation of india
mictv telugu

LICలో ఇంటర్,డిగ్రీ అర్హతతో ఉద్యోగవకాశాలు

November 23, 2022

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) తమ సంస్థలో ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. పార్ట్ టైమ్ ఏజెంట్ , ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఖాళీల కోసం ప్రకటన విడుదల చేసింది. ఈ రెండు విభాగాల్లో 200 ఖాళీలు ఉన్నట్టు తెలిపింది. పార్ట్ టైమ్ ఏజెంట్ కొరకు 12 తరగత ఉత్తీర్ణత ఉండాలని తెలిపింది. వారికి రూ.7 వేల నుంచి రూ.25 వేల వరకు జీతం చెల్లించనుట్లు వెల్లడించింది. ఇక ఇన్సూరెన్స్ అడ్వైజర్లకు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ చదివి ఉండాలని.. వీరికి రూ.7 వేల నుంచి రూ.15 వేల వరకు జీతంగా చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. అర్హత గల అభ్యర్థులు 2 డిసెంబర్ 2022 లోగా www.ncs.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.