ఇంజనీరింగ్ చేసిన నిరుద్యోగ యువతీయువలకు శుభవార్త. ఈసీఐఎల్ లో టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగం పొందాలనుకుంటే…ఈ బంపర్ ఆఫర్ మీకోసమే. మొత్తం 200టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను ఎలాంటి పరీక్షలేకుండానే ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికేట్లతో సంస్థ నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరైతే సరిపోతుంది. ముందుగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈసీఐఎల్ వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని సంస్థ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.
అర్హతలు:
బీటెక్, బీఈ చేసిన విద్యావంతులకు ఇది మంచి అవకాశం.కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేయడానికి ఆసక్తి చూపించే వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఈ, బీటెక్ లో సీఎస్ఈ, ఐటీ, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్ తోపాటు ఎలక్ట్రికల్ లో 60శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎలక్షన్, ఫీల్డ్ ఆపరేషన్, రిపేర్ అండ్ మెయిన్టెనెన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎక్వీప్ మెంట్, ఇండస్ట్రీయల్ ప్రొడక్షన్ లో కనీసం సంవత్సరం పనిచేసిన అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతం:
టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు..www.ecil.co.in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికెట్లు, ఎక్స్పీయరెన్స్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి. ఎంపిక ద్వారా పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా నిర్ణయిస్తారు. ఇంటర్వ్యూలో సెలక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు 25వేల జీతం, ఏడాది పూర్తయిన తర్వాత 28వేలు, రెండో ఏడాది పూర్తిగా అవ్వగానే 31వేల జీతం అందుకుంటారు.
ఇంటర్వ్యూ ద్వారానే సెలక్షన్:
ఉద్యోగం పొందిన అభ్యర్థులు ఇన్సూరెన్, హెల్త్ బెనిఫిట్స్ తోపాటు పీఎఫ్, టీఏ, డీఏ, పెయిడ్ లీవ్స్ వంటివి ఉంటాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 11వ తేదీ ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఎలాంటి పరీక్షలు ఉండవు. ఇంటర్వ్యూ వచ్చే అభ్యర్థులు అప్లికేషన్ ఫాంతోపాటు స్టడీ సర్టిఫికేట్స్ కు సంబంధించిన ఒరిజినల్స్ వెంట తీసుకురావాలి. ఈసీఐఎల్ లోని ప్రధానకార్యాలయం సీఎడ్ లో ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది.