నోట్ల రద్దుతో నిరుద్యోగ భారతం - MicTv.in - Telugu News
mictv telugu

నోట్ల రద్దుతో నిరుద్యోగ భారతం

March 6, 2018
  • దేశంలో 3 కోట్ల మంది నిరుద్యోగులు

  • ఆల్ లైట్ హై కి నిరుద్యోగ రేటు

  • అక్టోబర్ 2016 తర్వాత ఇదే ఎక్కువ

               ఎంత మంది నాయకులు మారినా,  ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా దేశంలోని నిరుద్యోగుల తలరాత మాత్రం మారడం లేదు. అధికారంలోకి వస్తే కోటి ఉద్యోగాలు కల్పిస్తామన్న మోడీ సర్కార్, ఆచరణలో విఫలమవుతున్నట్టు కనిపిస్తుంది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) విడుదల చేసిన నివేదికనే ఇందుకు సాక్ష్యం. ఆ రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం దేశంలో 3 కోట్ల పది లక్షల మందికి ఉద్యోగాలు లేవు. అక్టోబర్ 2016 తర్వాత ఇదే అత్యధికం. గత 16 నెలల నుంచి దేశంలో నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. పోయిన ఫిబ్రవరి నాటికి 7.1 శాతం పెరిగింది.

              నోట్ల రద్దుకు ముందు దేశంలోని నిరుద్యోగుల శాతం క్రమంగా తగ్గుతూ ఉంది. ఎప్పుడైతే ప్రధానమంత్రి మోడీ నోట్లను రద్దు చేసిండో అప్పటి నుంచి నిరుద్యోగం పెరుగుతోందని CMIE నివేదిక బయటపెట్టింది. ఈ సంవత్సరం మే తో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే కొత్తగా నిరుద్యోగులుగా మారే వారిలో పట్టణ ప్రాంత ప్రజలే ఉండే అవకాశం ఉంది.

మే నెలతో చదువులు పూర్తైన వాళ్లంతా ఉద్యోగాల కోసం ప్రయత్నించడమే ఇందుకు కారణం. అయితే ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారు తగ్గుతారని CMIE నివేదిక అంచనా వేసింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభంతో గ్రామాల్లోనే ఉపాధి దొరకడంతో ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారు తగ్గుతారన్నది  CMIE నివేదిక సారాంశం.