టెన్త్‌ అర్హతతో ఆర్మీలో ఉద్యోగాలు - MicTv.in - Telugu News
mictv telugu

టెన్త్‌ అర్హతతో ఆర్మీలో ఉద్యోగాలు

March 12, 2022

army

పదవ తరగతి పాసైన అభ్యర్థులకు భారత ప్రభుత్వ రక్షణ శాఖ శుభవార్త చెప్పింది. జబల్‌పూర్‌‌లో ఉన్న గ్రనైడర్స్‌ రెజిమెంటల్‌ సెంటర్‌ కమాండెంట్‌ కార్యాయంలో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఈ ఉద్యోగాలకు ఏ విధంగా ఆప్లై చేయాలి, ఖాళీల సంఖ్య ఎంత, జీతభత్యాలు ఎంత, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారాన్ని వెల్లడించింది.

మొత్తం పోస్టులు: 14

పోస్టుల వివరాలు:
1. కుక్‌-9.
2. టెయిలర్-1.
3. బార్చర్-1
4. రేంజ్‌ చౌకీదార్- 1
5. సాఫాయివాలా-1

వయోపరిమితి:
అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు:
నెలకు రూ.18,000ల నుంచి రూ.19,900ల వరకు చెల్లిస్తారు.

అర్హతలు:
పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ చేసి ఉండాలి.
అలాగే సంబంధిత పనిలో ఏడాది పాటు అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం:
రాత పరీక్ష, స్కిల్‌ టెస్టు ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్: The Commandant, GRENADIERS Regimental Centre, Jabalpur (MP) PIN – 482001

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 12, 2022.
website: indianarmy.nic.in