ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్ష - MicTv.in - Telugu News
mictv telugu

ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్ష

May 16, 2022

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇండియన్ ఆర్మీలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్మీ పరిధిలోని వెస్టర్న్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ కింద గ్రూప్ సీ సివిలియన్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఎన్ని ఖాళీలు ఉన్నాయి? దరఖాస్తు ఎలా చేసుకోవాలి? జీతం ఎంత? ఎంపిక ఎలా ఉంటుంది? అనే పూర్తి వివరాలను అధికారులు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

”మొత్తం 30 ఖాళీలు ఉన్నాయి. లైబ్రేరియన్, ఫైనో గ్రేడ్-2, ఎల్డీసీ, ఫైర్‌మెన్, మెసెంజర్, బార్బర్, వాషర్‌మెన్, రేంజ్ చౌకీదార్, డాప్లీ వంటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు పదోవ తరగతి, ఇంటర్, బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు ఆల్‌లైన్‌లో indianarmy.nic.in వెబ్‌సైటులో దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది. నెలకు రూ. 18,000 నుంచి రూ. 1,12,400 వరకు జీతం ఉంటుంది”.