ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. మరో 10 వేల ఉద్యోగాలు - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. మరో 10 వేల ఉద్యోగాలు

July 16, 2020

 

recruited in Andhra Pradesh

కరోనా సమయంలో ఉన్న ఉద్యోగాలే కోల్పోయి అగమ్యగోచర స్థితిలో పడ్డారు చాలామంది. కుటుంబాలను పోషించుకోవడానికి చిన్న చిన్న పనులు కూడా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు ఎడారిలో ఒయాసిస్సులాంటి వార్త చెప్పింది. త్వరలో 10వేలకు పైగా ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది. అందులో 9,712 ఉద్యోగాలు వైద్య ఆరోగ్య శాఖలోనే ఉన్నాయి.  వైద్య ఆరోగ్యశాఖలో డాక్టర్లు, నర్సులతో పాటు మిగిలిన వైద్య సిబ్బంది ఉండనున్నారని  మంత్రి పేర్ని నాని వెల్లడించారు. 9,712 పోస్టులలో 5,701 కొత్తవి, 4,011 ఖాళీగా ఉన్న స్థానాలకు అని మంత్రి స్పష్టంచేశారు. మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు ఇలా..

1.ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ(గుంటూరు) హోం సైన్స్ విభాగంలో ఫ్రొపెసర్‌(2), అసోసియేటివ్‌ ప్రొఫెసర్‌(4) ఉద్యోగాల భర్తీ.

2.స్కూల్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్‌ కమిషన్‌లో 28 పోస్టులు.

3.సీఐడీ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌ ఉద్యోగాలు(10), స్టెనో పోస్టులు(10)

4.వైఎస్సార్ జిల్లా వెంకటాంపల్లిలో వైఎస్సార్ హార్టికల్చర్‌ యూనివర్సిటీ కింద అరటి పరిశోధన సంస్థలో 11 పోస్టులు(5 టీచింగ్‌, 6 నాన్ టీచింగ్).

5.ఒంగోలు ట్రిపుల్ ఐటీలో 210 టీచింగ్, 89 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ.

5.శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో 201 టీచింగ్‌, 89 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ.

కాగా, వీటికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు మంత్రి పేర్ని నాని తెలిపారు.