Jockey Company to set up units in two places in Telangana : KTR
mictv telugu

ఇబ్రహీంపట్నం, ములుగులలో జాకీ అండర్ వేర్ యూనిట్లు

November 16, 2022

Jockey Company to set up units in two places in Telangana : KTR

తెలంగాణలో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడులు పెట్టనుంది. ప్రముఖ అండర్ వేర్ ఉత్పత్తుల తయారీ సంస్థ పేజ్ ఇండస్ట్రీస్ రెండు చోట్ల తయారీ యూనిట్లను స్థాపించనుంది. ఈ సంస్థ ‘జాకీ’ పేరుతో అండర్ వేర్ ఉత్పత్తులను విక్రయిస్తోంది. బుధవారం కంపెనీ ప్రతినిధులు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు.

అనంతరం వివరాలను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రెండు యూనిట్లు ఇబ్రహీంపట్నం, ములుగులో ఏర్పాటవుతాయని, ఏడాదికి ఒక కోటి లో దుస్తులను ఉత్పత్తి చేయనుందని మంత్రి వివరించారు. ఈ పరిశ్రమల వల్ల యువతకు ఏడు వేల ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. తెలంగాణ తరపున జాకీ సంస్థకు హార్ధిక స్వాగతం పలుకుతున్నామని తెలిపారు.