నన్ను కొలిస్తే కరోనా పోగొడతా..జోగిని స్వర్ణలత - MicTv.in - Telugu News
mictv telugu

నన్ను కొలిస్తే కరోనా పోగొడతా..జోగిని స్వర్ణలత

July 13, 2020

jogini

నిన్నటి నుంచి సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి బోనాలు ప్రారంభమయ్యాయి.  శివసత్తుల శిగాలతో, ఊరేగింపులతో, పోతు రాజుల విన్యాసాలతో ప్రతి ఏడాది జరిగే బోనాల జాతర ఈ సారి నిరాడంబరంగా జరుగుతోన్న విషయం తెలిసిందే.  కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావడంలేదు. ఇందులో భాగంగా జోగిని స్వర్ణలత చెప్పిన భవిష్యవాణిలో అమ్మవారు ప్రజలకు హెచ్చరికలు చేశారు. 

రానున్న కాలంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని గుర్తు చేశారు. కరోనాను కట్టడి చేయడానికి తాను సిద్ధమని అమ్మవారు తెలిపారు. ఐదు వారాలు శాక పోసి, యజ్ఞాలు చేస్తూ తనను కొలవాలని అమ్మవారు చెప్పారు. ప్రతి గడప నుంచి శాక, పప్పుబెల్లాలు తీసుకురావాలని, ఈ పూజలు భక్తిభావనతో చేస్తే తప్పకుండా కాపాడతానన్నారు. ఈసారి జరుగుతోన్న ఉత్సవాలు తనకు సంతోషంగా లేవన్నారు. 19వ శతాబ్దం ప్రారంభంలో ప్లేగువ్యాధి అంతరించడంతో అప్పట్లో సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతర ప్రారంభమైంది.