నా వల్ల కాదంటూ చేతులెత్తేసిన మాజీ భార్య.. వదిలేసిన జానీ డెప్ - MicTv.in - Telugu News
mictv telugu

నా వల్ల కాదంటూ చేతులెత్తేసిన మాజీ భార్య.. వదిలేసిన జానీ డెప్

June 10, 2022

హాలీవుడ్ హీరో జానీడెప్ తన మాజీ భార్య అంబర్ హర్డ్‌ మీద కోర్టులో పరువు నష్టం దావా గెలిచిన విషయం తెలిసిందే. ఇరువైపులా తప్పు ఉందని నిర్ధారించిన కోర్టు.. జరిమానా విషయంలో మాత్రం జానీడెప్‌ వైపు మొగ్గు చూపింది. మాజీ భార్య రూ. 110 కోట్లను డెప్‌కు చెల్లించాలని ఆదేశించింది. అయితే అంత డబ్బు తన వద్ద లేవని, ఆ స్థోమత కూడా తనకు లేదని అంబర్ కోర్టుకు విన్నవించుకుంది. దాంతో ఇద్దరు మాజీ భార్యాభర్తల మధ్య అటార్నీ ఒక ఒప్పందం కుదిర్చారు. దాని ప్రకారం, అంబర్ పరిహారం చెల్లించక్కర్లేదు. దానికి బదులుగా ఆమె కోర్టు తీర్పుపై పై న్యాయస్థానానికి అప్పీలుకు వెళ్లవద్దని షరతు విధించారు. ఈ విషయాన్ని డెప్ న్యాయవాది బెంజిమన్ వెల్లడిస్తూ డెప్ పరువు నష్టం దావా వేసింది డబ్బు కోసం కాదు. తన పరువు ప్రతిష్టను పునరుద్ధరించుకోవడానికి. ఆయనకు కావాల్సింది అంతవరకే. అయితే క్లయింట్, అటార్నీల మధ్య జరిగిన సంభాషణను మాత్రం తాను వెల్లడించబోవట్లేదని తెలియజేశారు. కాగా, భారత ఇతిహాసాల్లోని శ్రీకృష్ణుడి పాత్ర స్పూర్తితో డిజైన్ చేసిన పాత్రను పోషించి జానీడెప్ ఫేమస్ అయ్యాడు. ఆ చిత్రం పేరు పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్. అందులో ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా చిరునవ్వుతో అధిగమించి తనకు అనుకూలంగా మార్చుకునే పాత్రలో జానీడెప్ అద్భుతంగా నటించాడు.