Johnson holds the Guinness record for the biggest mouth of the world
mictv telugu

కేవలం నోరు తెరిచి గిన్నీస్ రికార్డు సాధించిన యువకుడు.. ఎలాగో వీడియో చూడండి

September 9, 2022

గిన్నీస్ రికార్డు సాధించాలంటే ప్రత్యేక టాలెంట్ ఉండాలని అనుకుంటారు చాలా మంది. కానీ, అవేవీ లేకుండానే కొందరు అరుదైన రికార్డులు సాధిస్తుంటారు. ఈ కోవకు చెందిన యువకుడి గురించి ఈ కథనం. కేవలం నోరు మాత్రమే తెరచి అమెరికాకు చెందిన ఐజాక్ జాన్సన్ అయే టీనేజర్ గిన్నీస్ రికార్డు సాధించాడు. మిన్నోసోటా రాష్ట్రానికి చెందిన ఈ యువకుడు ఎంత పెద్దగా నోరు తెరుస్తాడంటే ఇతని ముందు భారతీయ గయ్యాళి మహిళలు కూడా సాటిరారు. 2019లో ఏకంగా 3.67 అంగుళాల మేర నోటిని తెరచి రికార్డు సృష్టించాడు. అయితే అమెరికాకే చెందిన మరో యువకుడు ఇతడి కన్నా పెద్దగా 3.75 అంగుళాలు తెరచి అధిగమించగా, జాన్సన్ మళ్లీ తన ప్రయత్నాలను మొదలుపెట్టాడు. 2020లో జరిగిన ఓ పోటీలో 4 అంగుళాలు తెరచి మళ్లీ రికార్డును తనపేర లిఖించుకున్నాడు. ఈ సారి 4.014 అంగుళాలు తెరచి తన రికార్డును తానే అధిగమించాడు. దీంతో పురుషుల్లో అత్యంత పెద్దగా నోరు తెరచిన వ్యక్తిగా నిలిచాడు. తన సామర్ధ్యం చూపించేందుకు ఒకేసారి నాలుగు మెక్ డొనాల్డ్ బర్గర్లను నోటిలో పెట్టుకున్నాడు. ఆ వీడియోను గిన్నీస్ బుక్ వారు రిలీజ్ చేయగా, ఇప్పటివరకు మూడు లక్షల మంది వీక్షించారు.