Johnson & Johnson has announced that it will stop selling talcum powder
mictv telugu

బేబీ పౌడర్‌లో క్యాన్సర్ కారకాలు.. అమ్మకాలు నిలిపివేయనున్న సంస్థ

August 12, 2022

ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ పౌడరు ఇకపై కనిపించదు. అందులో క్యాన్సర్ కారకాలు ఉన్నాయన్న ఆరోపణలు పెద్ద ఎత్తున రావడంతో 2023 నాటికి అమ్మకాలను నిలిపివేస్తామని సంస్థ ప్రకటించింది. ఈ పౌడరుపై అమెరికా, కెనడా దేశాలు 2020లో నిషేధం విధించగా, తాజాగా అనేక వివాదాలు, ఫిర్యాదులు రావడంతో సంస్థ పై నిర్ణయం తీసుకుంది. అయితే టాల్క్ ఆధారిత పోర్ట్‌ఫోలియో నుంచి కార్న్‌స్టార్చ్ ఆధారిత బేబీ పౌడరుకు మారుతున్నామని వెల్లడించింది. క్యాన్సర్ కారణంగా చనిపోయిన వారి బంధువులు, ఆరోగ్యం చెడిపోయిన వాళ్లు ఇప్పటికే సంస్థపై దాదాపు 38 వేల కేసులు పెట్టారు. ఇదే చికాకు అనుకుంటే గతంలో కోర్టు ఆదేశాల మేరకు 22 మంది మహిళలకు రెండు బిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. ఈ పరిణామంతో యూరప్ వ్యాప్తంగా డిమాండ్ భారీగా పడిపోయింది. అటు రాయిటర్స్ సంస్థ దశాబ్దాలుగా జరిపిన పరిశోధనల్లో పౌడరులో క్యాన్సర్ కారకం ఉందని 2018లో కథనం ప్రచురించింది. అయితే అప్పట్లో ఈ వార్తను ఖండించిన జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ ఇప్పుడు తమ పౌడరుని నిషేధిస్తున్నట్టు పేర్కొనడం గమనార్హం.