వ్యాక్సిన్ రేసులో జాన్సన్ అండ్ జాన్సన్.. ఒకే డోసుతో  - MicTv.in - Telugu News
mictv telugu

వ్యాక్సిన్ రేసులో జాన్సన్ అండ్ జాన్సన్.. ఒకే డోసుతో 

September 24, 2020

nvv

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు ప్రయోగాలు వేగంగా సాగుతూనే ఉన్నాయి. వ్యాక్సిన్ ట్రయల్స్ తుది దశకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీలు తమ వ్యాక్సిన్ పరీక్షల వేగం పెంచాయి. ఓ దశలో రష్యా వ్యాక్సిన్ కూడా విడుదల చేసింది. మరో వ్యాక్సిన్‌ను రిజిస్టర్ చేసుకునేందుకు సిద్ధమైంది. ఇక ఈ బాటలోనే జాన్సాన్ అండ్ జాన్సన్ సంస్థ కూడా ప్రయోగాలు చేస్తోంది. అయితే మిగితా వాటికి భిన్నంగా ఈ వ్యాక్సిన్ ఉండటం విశేషం.  

సాధారణంగా కరోనా వైరస్ అంతం చేయడానికి కనీసం రెండు డోసులు అయినా తీసుకోవాలని ఇప్పటి వరకు పలు కంపెనీలు ప్రకటించాయి. కానీ తమ సంస్థ తయారు చేసే మందు ఒకే ఒక్క డోసు ఇస్తే కరోనా అంతం అవుతుందని చెబుతోంది. దీనికి సంబంధించిన ట్రయల్స్ తుది దశకు చేరుకున్నాయని ప్రకటించింది. అమెరికా, అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ, కొలంబియా, మెక్సికో, పెరూలో మొత్తం 60 వేల మంది వలంటీర్లకు  ఈ టీకా ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు. మంచి ఫలితాలు రాగానే మార్కెట్లోకి విడుదల చేస్తామని ప్రకటించారు. ఒకే డోస్ అవసరం అయ్యే ఈ వ్యాక్సిన్ ఎలా పని చేస్తుందో చూడాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.