వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం క్షీణించడం సహజం. 40ల తర్వాత జీవిక్రియల్లో తేడాల వస్తాయి. 50, 60లలో మరెన్నో సమస్యలు. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు బాధిస్తాయి. ఆస్టియో ఆర్థరైటిస్‌తో మోకాళ్ల నొప్పులు వస్తాయి. సాధారణంగా 50-70 సంవత్సరాల వయసులో ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుంది. ఆస్టియో ఆర్థరైటిస్‌తో మోకాళ్లు, తుంటి నొప్పి మొదలవుతాయి. వయసు పెరగడంతో మోకాలి కీలులోని కార్టిలేజ్ (మృదులాస్థి) అరిగిపోయి, నొప్పి కలుగుతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో కూడా మోకాళ్ల నొప్పులు వస్తాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్. దీని వల్ల శరీరంలోని అన్ని భాగాల్లోని కీళ్లలో నొప్పులు మొదలవుతాయి.
పరీక్ష :
చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు వస్తే రుమటాయిడ్ ఫాక్టర్ పరీక్ష చేయించుకోవాలి. విటమన్-డీ, కాల్షియం లోపంతో పిల్లల్లో ఎముకల నొప్పి వస్తుంది. పిల్లలు పెరుగుతున్న కొద్దీ ఎముకల సైజ్ పెరుగుతుండటం వల్ల నొప్పి వస్తుంది. ఇది సాధారణమే. కింద కూర్చోవడం, ఇండియన్ టాయిలెట్ వాడితే మోకాళ్ల నొప్పులు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న వయసులో మోకాళ్ల నొప్పి రావడానికి కీలులో ఉండే కార్టిలేజ్ అరిగిపోవడమే కారణం.
చికిత్స :
ఎక్కువ కూర్చునేవారికి, డెస్క్ జాబ్ చేసేవారికి మోకాళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. మోకాళ్లలో సైనోవియల్ ఫ్లూయిడ్ ఎప్పుడూ సరాఫరా అవుతుండాలి. దీనికోసం ప్రతీ అరగంటకు ఒకసారి 10 నిమిషాలు నడవాలి. వ్యాయామంతో మోకాళ్ల నొప్పులు రాకుండా నివారించవచ్చు. మోకాలి నొప్పికి సాధారణంగా సర్జరీ అవసరం లేదు. మందులు, వ్యాయామంతో నొప్పిని తగ్గించుకోవచ్చు. చివరి దశలో మాత్రమే సర్జరీ అవసరం ఉంటుంది. కీలు మార్పిడిలో మొత్తం కీలు మార్చకుండా కూడా ట్రాన్స్‌ప్లాంట్ చేయొచ్చు. మోకాలి మార్పిడి ఆపరేషన్‌తో 15-20 ఏళ్ల వరకు నొప్పి రాదు.
అధిక బరువు :
అధిక బరువుతో మోకాళ్ల నొప్పులు వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. బరువు తగ్గించుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తే మోకాళ్ళు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటాయి.