16ఏళ్ల యూట్యూబ్‌ స్టార్.. రూ.25 కోట్లతో భవంతి కొని.. - MicTv.in - Telugu News
mictv telugu

16ఏళ్ల యూట్యూబ్‌ స్టార్.. రూ.25 కోట్లతో భవంతి కొని..

January 16, 2020

NB BNBG

ఇంటర్నెట్ స్టార్, యూట్యూబర్, టిక్‌టాక్ స్టార్, సోషల్ మీడియా సెలబ్రిటీ.., ఇప్పుడు ఇలాంటి పేర్లతో చాలామంది ప్రాచుర్యంలోకి వస్తున్నారు. ప్రముఖులు అవుతున్నారు. గతంలో ఎవరో క్రియేట్ చేసిన ప్లాట్‌ఫామ్ వద్దకు వెళ్లి, నానా తంటాలు పడి అవకాశం వస్తే అప్పుడు తమ టాలెంట్ నిరూపించుకుని.. పేరు, పరపతి సంపాదించుకునేవారు. ఇప్పుడు మొత్తం మారిపోయింది. అవేమీ లేకుండా సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిపోవచ్చు. ఎవరికివారు యూట్యూబ్‌లో సొంత ఛానళ్లు సృష్టించుకుని వీడియోలు చేస్తూ వేలు, లక్షలు, మిలియన్ల వ్యూస్, సబ్‌స్క్రైబర్లను సొంతం చేసుకుంటున్నారు. దీంతో వారు ఫేమస్ అవడమే కాదు, డబ్బులు కూడా ఘనంగానే సంపాదించుకుంటున్నారు. అలా ఓ 16 ఏళ్ల యూట్యూబర్ కూడా బాగా ఫేమస్ అయి, అంతకన్నా బాగా డబ్బు సంపాదించుకుంది. అంతేకాదు ఆ డబ్బుతో కొత్త ఇంటిని కూడా కొనుగోలు చేసింది. 

 తన పాటలతో, నృత్యాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆమె పేరు జోజో సివా. అమెరికాకు చెందిన ఆమె అనతికాలంలోనే ప్రముఖ యూట్యూబర్‌గా ఎదిగింది. తన ఛానల్‌కు  ఇప్పుడు కోటిన్నర మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. దీంతో ఆమెకు యాడ్స్‌ రూపంలో ఊహించని డబ్బు వస్తోంది, పేరు కూడా వస్తోంది. అనతికాలంలోనే సెలెబ్రిటీ అయిపోయింది. అలా తనకు వచ్చిన డబ్బుతో (పాతిక కోట్లు) లాస్‌ ఏంజెలెస్‌ రాష్ట్రంలోని టార్జానా నగరంలో ఓ భవంతిని కొనుగోలు చేసింది. ఆరువేల చదరపు గజాల విస్తీర్ణం గల ఈ భవంతిలో స్విమ్మింగ్‌ పూల్‌ కూడా ఉంది. బాస్కెట్‌ బాల్‌ కోర్టు అదనపు ఆకర్షణ. ఇంతవరకు అమెరికా, కాలిఫోర్నియాలోని ఓక్స్‌లో తల్లిదండ్రులతో ఉన్న ఇంటిని ఖాళీ చేసి ఇప్పుడు కొత్త ఇంటికి షిఫ్ట్ అయింది. కాగా, తన ఇంటిని పరిచయం చేస్తూ ఆమె తీసిన వీడియోను ఆమె గురువారం సోషల్‌ మీడియాలో విడుదల చేసింది. దీంతో అది వైరల్‌గా మారింది. ‘స్వశక్తితో ఎదిగి, చిన్న వయసులోనే ఇల్లు కొని అమ్మానాన్నలతో ఉంటున్న నువ్వు గ్రేట్.. అభినందలు’ అంటూ ఆమె అభిమానులు కామెంట్లతో అభినందనల వర్షం కురిపిస్తున్నారు.