దారుణం.. రూ.100 అప్పు తీర్చలేదని మార్మాంగాన్ని కొరికి..
‘అప్పు ప్రాణాలకు ముప్పు’ అని పెద్ద మనుషులు ఇందుకే అన్నారేమో. ఇలాంటివాళ్లు అప్పట్లో అప్పులు తీసుకున్నవారిపై జులుం ప్రదర్శించినందువల్లే ఈ నానుడి పుట్టుకొచ్చిందేమో. కేవలం రూ.100 కోసం ఎవరైనా ప్రాణాలు తీయాలని చూస్తారా? అసలు అది అప్పు కిందకే రాదని కొందరు మరిచిపోతారు. మొండి బకాయిలను వసూలు చేయాలంటే పోలీస్ స్టేషన్లకు వెళ్తారు. లేదంటే పంచాయితీ పెట్టి వసూలు చేసినవారిని చూశాం. కానీ, ఇది చాలా చిత్రమైన సంఘటన. ఓ వ్యక్తి తనవద్ద తీసుకున్న రూ.100 అప్పును తిరిగి ఇవ్వడంలేదని ఏకంగా అతని మార్మాంగాన్నే కొరికేశాడు.
ఈ ఘటన కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం జోలదరాశిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వెంకటేశ్వర్లు గతంలో స్నేహితుడైన వెంకటసుబ్బయ్య వద్ద రూ.100 అప్పు తీసుకున్నాడు. ఆ వంద తిరిగి ఇవ్వాలని వెంకటేశ్వర్లు పలుమార్లు అడిగాడు. ఇవాళ ఇస్తాను.. రేపు ఇస్తానని వెంకటసుబ్బయ్య మాట దాటవేయసాగాడు. దీంతో సహనం నశించిన వెంకటేశ్వర్లు తన వంద ఇవ్వాల్సిందేనని గట్టిగా అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు కిందపడిపోయాడు. అప్పటికే విచక్షణ కోల్పోయిన వెంకటసుబ్బయ్య అతని మార్మాంగాన్ని కొరికాడు. తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితికి చేరుకున్న బాధితుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.