తెలుగు బుల్లితెరలోనే అత్యంత పాపులర్ షో జబర్దస్త్. టాలీవుడ్ కి కమెడియన్స్ ని సప్లై చేసే ఫ్యాక్టరీగా.. ఎందరో కళాకారులకి ఒక అద్భుత అవకాశంగా జబర్దస్త్ వెలుగొందుతుంది. దశాబ్దం నుండి టెలికాస్ట్ అవుతున్నా.. చెక్కుచెదరని క్రేజ్ జబర్దస్త్ సొంతం. జబర్దస్త్ ద్వారా పరిచయమైన కమెడియన్స్ కొందరు సినిమాల్లో స్టార్స్ అయిపోతే.. మరికొందరు లక్షాధికారులు అయిపోతున్నారు. అయితే కొత్తగా జబర్దస్త్ లోని ఒక జంట మాత్రం భార్యాభర్తలు కానున్నారు. సుధీర్-రష్మీ, ఇమ్మాన్యుయేల్-వర్ష వంటి జంటలు పెళ్లిళ్లు చేసుకోబోతున్నారని పుకార్లు వచ్చినా తొలిసారి నిజంగానే పెళ్లిపీటలెక్కనున్న జంటగా నిలవబోతున్నారు జబర్దస్త్ కమెడియన్ రాకేష్, జోర్దార్ వార్తలు చేప్పే సుజాతలు. చాలా రోజుల నుంచి వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటారు అని వస్తున్న వార్తలపై నెటిజన్లకు క్లారిటీ ఇచ్చేశారు.
ఇక తమ బంధాన్ని మరో స్టేజ్ కి తీసుకెళ్లేందుకు రెడీగా ఉన్నట్లు ప్రకటించింది జోర్దార్ సుజాత. దీనికి ఇరువురు కుటుంబ సభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు సుజాత-రాకేశ్. త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నామని శుభవార్త చెప్పారు. జోర్దార్ సుజాత తన యూట్యూబ్ ఛానెల్ అయిన సూపర్ సుజాత ఛానెల్ లో ఈ గుడ్ న్యూస్ ను తన సబ్ స్క్రైబర్లతో పాటు అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ నెల చివర్లో నిశ్చితార్థం ఉండనుందని.. త్వరలోనే పెళ్లి డేట్ కూడా చెప్తామని వీడియోలో సుజాత పేర్కొంది. ఇక జనవరి 20న ప్రసారం కానున్న రాబోయే జబర్దస్త్ ఎపిసోడ్ ప్రోమోలో కూడా రాకేష్ అఫీషియల్ అనౌన్సమెంట్ ఇచ్చేశాడు. తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో రాకేష్ తన ప్రేమకు చిహ్నంగా సుజాతకు నిశ్చితార్థపు ఉంగరాన్ని బహూకరించాడు.