నా బాడీ షేపుల గురించి అడిగాడు.. మహిళా రిపోర్టర్ - MicTv.in - Telugu News
mictv telugu

నా బాడీ షేపుల గురించి అడిగాడు.. మహిళా రిపోర్టర్

October 19, 2018

‘మీటూ’ ఉద్యమంలో సినీరంగంలోనే కాదు.. మీడియా రంగంలోని చీకటి కోణాలు కూడా బయటకొస్తున్నాయి. ఓ ప్రైవేటు టీవీ చానెల్‌లో పని చేసిన ఓ సీనియర్ న్యూస్ ప్రొడ్యూసర్‌పై మహిళా జర్నలిస్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను లైంగికంగా ఎన్నోసార్లు వేధించాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఆ ప్రొడ్యూసర్‌ను నోయిడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే సదరు న్యూస్ ప్రొడ్యూసర్ కూడా మహిళా జర్నలిస్టుపై ఫిర్యాదు చేశాడు. ఆమెకు కాబోయే భర్తతో కలిసి తనను రూ.25లక్షలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు.Journalist Booked By Cops As Ex- Colleague Alleges Harassment: Accused Claims Blackmailమహిళా జర్నలిస్టు మాట్లాడుతూ.. ‘నా శరీర భాగాల షేపుల గురించి న్యూస్ ప్రొడ్యూసర్ అడిగాడు. నేను భయపడి మౌనంగా ఉండిపోయాను. ఒక సర్వే నిర్వహిస్తున్న అంటూ ఇంక దారుణంగా ప్రశ్నలు అడిగాడు. నేను ఉద్యోగంలో కొత్తగా చేరాను. అందుకే అప్పుడు ఎవరికి చెప్పుకోలేకపోయాను. నాలాగే మరో మహిళకు ఇలాజరిగింది. నేను మౌనంగా ఉంటే ఇలాగే ఇంకా చాలామందికి జరుగుతుందేమోనని ఇప్పుడు ధైర్యంగా ముందుకొచ్చి చెబుతున్నాను. అతణ్ణి కఠినంగా శిక్షించాలి. అప్పుడే మహిళల జోలికి ఎవ్వరూ రారు.’ అని బాధితురాలు పేర్కొంది.