శబరిమలలో తెలుగు మహిళ సాహసం.. హెల్మెట్, బులెట్ ఫ్రూఫ్ జాకెట్లో అయ్యప్ప చెంతకు - MicTv.in - Telugu News
mictv telugu

శబరిమలలో తెలుగు మహిళ సాహసం.. హెల్మెట్, బులెట్ ఫ్రూఫ్ జాకెట్లో అయ్యప్ప చెంతకు

October 19, 2018

శబరిమల రణరంగాన్ని తలపిస్తోంది. రుతక్రమ వయసులో ఉన్న మహిళలను ఒకపక్క ఆందోళనకారులు అడ్డుకుంటుండంగా మరోపక్క పోలీసులు కాపాడుతున్నారు. వారికి అండగా నిలుస్తున్నారు. నీలక్కల్, పంబ క్యాంపును దాటి అయ్యప్ప దర్శనానికి కొండదారిలో వెళ్తున్న మహిళల్లో హైదరాబాద్‌కు చెందిన మోజో టీవీ తెలుగు జర్నలిస్టు జక్కల కవిత కూడా ఉన్నారు.

 

ఆమెతోపాటు మరో కేరళ జర్నలిస్టు, మహిళా హక్కుల కార్యకర్త  కొంతమంది మహిళలు వందలాది పోలీసుల రక్షణలో శరణం శరణం అయ్యప్పా అంటూ వెళ్తున్నారు. ఆందోళనకారులు రాళ్లు రువ్వుతారనే భయంతో పోలీసులు వారికి హెల్మెట్లు, బులెట్ ఫ్రూఫ్ జాకెట్లు, ప్రత్యేక దుస్తులు ఇచ్చారు. న్యూయార్క్ మహిళా జర్నలిస్టులపై నిన్న భక్తాదులు దాడి చేయడంతో వీరికి రక్షణ కల్పిస్తున్నారు. వీరు ఈ సాయంత్రానికి అయ్యప్పను దర్శించుకునే అకాశముండడంతో కొండపై తీవ్ర ఉద్రికత్త నెలకొంది. వీరిని అయ్యప్ప భక్తులు అడుగడున అడ్డుకుని నినాదాలు చేస్తున్నారు. పోలీసులు వారిని తరిమేస్తున్నారు.

శబరిమల అయ్యప్పను దర్శించుకోవడానికి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడం తెలిసిందే. గుడిని తెరవడంతో పలువురు మహిళలు కొండదారి పట్టారు. అయితే అయ్యప్ప భక్తులు వారిని వెతికివెతికి తరిమేస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి పినయి విజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా బీజేపీ, ఆరెస్సెస్‌ల పనే అని ఆరోపిస్తున్నారు. మరోపక్క.. ఆలయంలోకి మహిళ ప్రవేశాన్ని పలు హిందూ సంఘాలు కేరళ బంద్‌కు పిలుపునిచ్చాయి. కొజికోడ్‌, అటింగళ్‌, ఛెథ్రాల ప్రాంతాల్లో కేఎస్‌ఆర్‌టీసీకి చెందిన బస్సులపై రాళ్ల దాడి చేశాయి. మరోపక్క.. శబరిమల వెళ్లడానికి పయనమైన మహిళాహక్కుల నేత తృప్తి దేశాయ్‌ని పుణేలోనే ఆందోళనకారులు అడ్డుకున్నారు.