ఈ జర్నలిస్టు నిజాయతీకి జేజేలు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఈ జర్నలిస్టు నిజాయతీకి జేజేలు..

November 22, 2017

రోడ్డుపైన పది రూపాయలు దొరికితే చప్పున జేబిలో వేసుకుని గప్‌చుప్‌గా వెళ్లిపోతుంటారు. మనలో చాలామంది ఇదే చేస్తుంటారు. కానీ ఆ జర్నలిస్టు మాత్రం అలా చేయలేదు..  ఎవరో రోడ్డుపై  పోగొట్టుకున్న డబ్బును జాగ్రత్తగా కాపాడాడు. ఆ డబ్బును ఎత్తుకుపోతున్న వాళ్లను అడ్డుకున్నాడు. నోట్లను జాగ్రత్తగా ఏరుకుని.. పోలీస్ స్టేషన్లో భద్రంగా అప్పగించాడు. ఈ జర్నలిస్టు పేరు. ఎన్. శ్రీనివాస్. గతంలో జెమినీ న్యూస్ లో పనిచేసిన ఆయన ప్రస్తుతం స్నేహ టీవీ విలేకరిగా  విధులు నిర్వహిస్తున్నారు. 

శ్రీనివాస్ చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే..

‘హాయ్…ఫ్రెండ్స్…  నిన్న సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుంటే…ఫిలిం నగర్ టర్నింగ్‌లో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి జేబులోంచి కొంత డబ్బు పడిపోయింది… ఆయన చూసుకోలేదు. నేను అరుస్తున్నా ఆయనకు  వినపడలేదు… చెల్లాచెదురుగా పడి ఉన్న నగదును అక్కడ ఉన్న కొందరు ఎత్తుకు పోతుండగా..మరో వ్యక్తితో కలిని ఆపే ప్రయత్నం చేసా….అప్పటికే కొందరు జేబులో వేసుకొని ఉడాయించారు….అయితే …కొంత డబ్బును సేవ్ చేయగలిగాను….ఆ నగదును ఫిలిం నగర్ క్లబ్‌లో ఉన్న బంజారాహిల్స్ పోలీస్ అవుట్ పోస్ట్  ఎస్ఐ గోవర్దన్‌కు  హ్యాండోవర్ చేసాను…ఆ నగదు పొలీసుల సమక్షంలో కౌంట్ చేస్తే…46,980 (నలబై ఆరు వేల తొమ్మిది వందల ఎనబై రూపాయలు)గా తేలింది…’ అని చెప్పారు. పోగొట్టుకున్న డబ్బు వివరాలు, పోలీస్ స్టేషన్ వివరాలతో ఫొటోలు కూడా పెట్టారు  విలేకరి.