గౌరి హత్యపై భగ్గుమన్న ట్యాంక్ బండ్ - MicTv.in - Telugu News
mictv telugu

గౌరి హత్యపై భగ్గుమన్న ట్యాంక్ బండ్

September 9, 2017

కర్ణాటకకు చెందిన ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్యపై తెలంగాణ పాత్రికేయులు తీవ్ర నిరసన తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై వందలాది జర్నలిస్టులు, ప్రజాసంఘాల నేతలు, కార్యకర్తలు హాజరై ఆమెకు ఘనంగా నివాళి అర్పించారు. దేశంలో ఫాసిస్టు దాడులు పెరుగుతున్నాయని, పత్రికా స్వేచ్ఛ గొంతు నులుముతున్నారని జర్నలిస్టులు మండిపడ్డారు.

హేతువాదులైన కలబర్గి, నరేంద్ర దభోల్కర్ లను హత్యచేసినట్లే గౌరిని కూడా ఫాసిస్టు మూకలు పొట్టనబెట్టుకున్నాయని సీపీఐ నేత నారాయణ ధ్వజమెత్తారు. ఈ హత్య వెనుక ప్రభుత్వ హస్తముందని విరసం నేత వరవరరావు, ఈ దురాగతం దేశంలో పెరుగుతున్న అసహనానికి ప్రతీక అని అల్లం నారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరాం, రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్, అరుణోదయ విమల తదితరులు పాల్గొన్నారు.