మెట్రో.. తెలిరోజే రికార్డు బద్దలు.. - MicTv.in - Telugu News
mictv telugu

మెట్రో.. తెలిరోజే రికార్డు బద్దలు..

November 30, 2017

హైదరాబాద్  మెట్రో రైలు తొలిరోజే రికార్టు  సృష్టించింది. బుధవారం ఏకంగా  2లక్షలకు మించి ప్రజలు ప్రయాణించారని అధికారులు చెప్పారు. ఇప్పటికే ప్రారంభించిన వివిధ నగరాల్లో మెట్రోలో తొలిరోజు 50వేల మందే ప్రయాణించారు.  కానీ హైదరాబాద్ మెట్రోలో తొలిరోజు 2లక్షల మందికి పైగా ప్రయాణించారని అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రారంభంలోనే  కిలోమీటర్ల  మార్గం అందుబాటులోకి తీసుకువచ్చింది మెట్రో. అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయాలను తలపించేలా మెట్రో స్టేషన్లను తీర్చిదిదద్దడంతో మెట్రోలో ప్రయాణించేందుకు  ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.మెట్రో రైలులో తొలిరోజే 2లక్షల మంది ప్రయాణించడం పట్ల మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. మెట్రోలో  రద్దీని నియత్రించేలా చర్యలు తీసుకోవాలని అధికారులు, ఎల్ అండ్  టీ ప్రతినిధులకు సూచించారు. పిల్లలకు, వృద్దులకు ఇలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.