దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను ఈ కాలం సెలబ్రిటీలు బాగా ఫాలో అవుతారు. అందుకే స్టార్ ఇమేజ్ ఉన్నప్పుడే వారి క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటుంటారు చాలా మంది హీరోయిన్లు . ఈ విషయంలో టాలీవుడ్, బాలీవుడ్ అన్న తేడా లేదు. ఏ ఇండస్ట్రీ అయినా సరే ఇన్కమ్ విషయంలో మాత్రం ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. ఈ విషయంలో బెస్ట్ ఎగ్జాంపుల్‌గా నిలుస్తుంది బాలీవుడ్ బ్యూటీ, అతిలోక సుందరి పెద్ద కూతురు జాన్వీ కపూర్. బాలీవుడ్లో చేసింది రెండు మూడు సినిమాలే అయినా జాన్వీ తెలుగులో నటించే మొదటి సినిమాకే భారీ రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేసిందట . మూవీ మేకర్స్ కూడా అంతమొత్తంలో చెల్లించారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఎన్టీఆర్ 30లో జాన్వీ నటిస్తున్న విషయం రీసెంట్గా ఫిల్మ్ మేకర్స్ అధికారికంగా కన్ఫార్మ్ చేశారు. జాన్వీ కూడా తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో మూవీలో తన లుక్కు సంబంధించిన పోస్టర్‌ను షేర్ చేసి ఫ్యాన్స్‌తో తన తెలుగు డెబ్యూ విషయాన్ని పంచుకుంది. యంగ్ టైగర్ ఎన్టీర్‌తో జాన్వీ మొదటిసారి తెలుగు తెర ముందు కనిపించబోతోంది. ఈ క్రమంలో మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించేందుకు జాన్వీ కపూర్ భారీగా రెమ్యునరేషన్ పుచ్చుకుందని ఇండస్ట్రీలో టాక్. తాజా సమాచారం ప్రకారం ఈ బ్యూటీ మొదటి సినిమాకే రూ.5 కోట్లు చార్జ్ చేసిందట. బాలీవుడ్లో జాన్వీ ఒక సినిమాకు రూ.3 కోట్ల నుంచి రూ.3.5 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటోంది. తన క్రేజ్ దృష్ట్యా తెలుగు సినిమాలో ఆఫర్ రావడంతో ఒకేసారి కోటిన్నర పెంచేసిందట. దీంతో టాలీవుడ్, బాలీవుడ్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది. ప్రాజెక్ట్ కె లో దీపికా పదుకొణె రూ.10 కోట్లు తీసుకుంటోంది. ఆమె తరువాత హై రెమ్యునరేషన్ తీసుకుంటున్న తారగా జాన్వీ పేరు ఇండస్ట్రీలో వినిపిస్తోంది.