ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జూ.ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జూ.ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్

May 28, 2022


టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్‌ వద్దకు చేరుకున్న జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌లు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌ సమాధి వద్దకు వచ్చిన ఇద్దరు సోదరులు పుష్పగుచ్ఛాలు ఉంచి తాతను స్మరించుకున్నారు. దగ్గుబాటి పురందేశ్వరి దంపతులు, నందమూరి రామకృష్ణ, సుహాసిని, నటి దివ్యవాణి, దైవాజ్ఞ శర్మ తదితరులు ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించారు. మరోవైపు ఎన్టీఆర్‌ జయంతి వేళ ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఘాట్‌ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. అంతకుముందు తన తాతగారైన నందమూరి తారక రామారావును తలుచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు జూయర్ ఎన్టీఆర్‌. . ఈ నేపథ్యంలో ‘సదా మీ ప్రేమకు బానిసను’..అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.