జూ. ఎన్టీఆర్ కారు నల్లతెర చించేశారు - MicTv.in - Telugu News
mictv telugu

జూ. ఎన్టీఆర్ కారు నల్లతెర చించేశారు

March 21, 2022

ntr

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలను ముమ్మరంగా చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఆదివారం జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ ముత్తు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో భాగంగా ప్రయాణిస్తున్న పలు వాహనాలను గుర్తించి, నలుపు తెరలను, స్టిక్కర్లను తొలగించారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరో జూ. ఎన్టీఆర్ కారుకున్న నలుపు తెరలను పోలీసులు తొలగించారు.

అనంతరం ఇన్ స్పెక్టర్ ముత్తు మాట్లాడుతూ..” కార్లకు నల్ల తెరలను, అనవసరమైన స్టిక్కర్లను, నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలను తనిఖీలు చేశాం. ఈ తనిఖీలలో జూనియర్ ఎన్టీఆర్ కారును కూడా తనిఖీ చేసి, కారుకున్న నల్ల తెరను తొలగించాం. కారులో డ్రైవరుతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు, మరొకరు ఉన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేరుతో ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్, మేరాజ్ హుస్సేన్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీధర్ రెడ్డి పేరుతో స్టిక్కర్ ఉన్న వాహనాలను గుర్తించి, స్టిక్కర్లను తీసేశాం. నంబరు ప్లేటు సరిగా లేని వాహనాలకు చలానాలు విధించాం. మొత్తం 90 వాహనాలపై కేసులు నమోదు చేశాం” అని ముత్తు తెలిపారు.